Puri Jagannath Temple: రేపు తెరుచుకోనున్న రత్న భాండాగారంలో మరో రహస్య గది
పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భాండాగారంలో మరో రహస్య గదిని గురువారం తెరవనున్నారు. అయితే ఆ రహస్య గదిలోకి సొరంగ మార్గం నుంచి వెళ్లాల్సి ఉంటుందని.. అందులోనే విలువైన సంపద ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో ఈ గదిలో ఏం ఉంటుందనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.