Railway Bridge: 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజినీర్లపై వేటు

మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది.

New Update
Madhya pradesh govt takes action against 8 engineers over bridge with 90-degree turn

Madhya pradesh govt takes action against 8 engineers over bridge with 90-degree turn

మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ డిజైన్‌పై తీవ్రంగా విమర్శలొచ్చాయి. అధికారుల నిర్లక్ష్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్‌పై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.   

MP Govt Takes Action Over Railway Bridge

Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

దీనిపై సీఎం మోహన్ యాదవ్‌ కూడా స్పందించారు. '' ఐష్‌బాగ్‌లో ROB నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించాం. రిపోర్టు ఆధారంగా 8 మంది PWD ఇంజినీర్లపై చర్యలు తీసుకున్నాం. ఇందులో ఏడుగురు ఇంజినీర్లను వెంటనే సస్పెండ్ చేశాం. నిర్మాణ ఏజెన్సీ, డిజైన్‌ను రూపొందించిన కన్సల్టెంట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో కూడా చేర్చాం. ROB పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని'' మోహన్ యాదవ్ అన్నారు. 

Also Read: ఉక్రెయిన్‌పై అదిపెద్దదాడి... 477 డ్రోన్లు, 60 క్షిపణులతో విరుచుకుపడిన రష్యా...

ఇదిలాఉండగా.. భోపాల్‌లోని ఐష్‌బాగ్‌ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. కానీ ఇది 90 డిగ్రీల మలుపు తిరిగి ఉంది. దీంతో ఈ నిర్మాణంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. నిర్మాణ సంస్థ మాత్రం ఆ రైల్వే బ్రిడ్జి డిజైన్‌ను సమర్థించుకుంది. దగ్గర్లో మెట్రో రైల్‌ స్టేషన్, భూమి కొరత ఉందని.. ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదని చెప్పింది.  కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉండి ఉంటే ఆ రూట్ సవ్యంగా ఉండేదని పేర్కొంది. కానీ దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. 

Also Read: బెంగళూరులో దారుణం...కుక్క రక్తంతో క్షుద్రపూజల కలకలం

Also Read: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్

 

madya pradesh | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు