పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట చేసుకోవడంతో ఇద్దరు బీజీపీ ఎంపీలు గాయపడ్డారు. విపక్ష నేత రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ తోపులాటపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తోటి ఎంపీలపై దాడి చేసిందుకు స్పీకర్ ఓంబిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం
మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీలు దాడి చేశారని, ఇద్దరు ఎంపీలను తోసేశారంటూ ఆరోపించారు. ప్రతాప్ సింగ్ సారంగీ, ముఖేష్ రాజ్‌పుత్‌లకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. రాహుల్ గాంధీపై తగిన చర్యలు తీసుకుంటామని.. గాయపడిన ఎంపీలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
BJP MP Pratap Chandra Sarangi is seriously injured at Parliament😢
— BhikuMhatre (@MumbaichaDon) December 19, 2024
"I was standing near stairs when Rahul Ghandy came & pushed an MP who fell on me, causing me to fall down"
If true, So much hatred? Why Mr Ghandy? Is this your Mohabbat ki Dukan? No respect for age, too? Dynast! pic.twitter.com/vaNYhBqz2V
Also Read: విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఆ ఫైళ్లు మిస్సింగ్!
ఇదిలాఉండగా రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేపట్టారు. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఎంపీలు కూడా అక్కడికి వచ్చారు. తమని లోపలికి వెళ్లనియకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
Also Read: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మృతి
ఈ గందరగోళంలో బీజేపీ ఎంపీలు ముకేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కిందపడి గాయాలపాలయ్యారు. దీంతో వీళ్లిద్దరిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించేలా మాట్లాడారని.. వెంటనే ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్‌ను అవమానించిందంటూ ఎన్డీయే నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు.
Also Read: 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే