అమిత్‌ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అమిత్‌ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

New Update
Amit shah ponnam

పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కూడా పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించిన అతిత్‌ షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.  

Also Read: పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు

'' భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను బీజేపీ అవమానిస్తే బీఆర్ఎస్‌ ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలి. విపక్ష పార్టీగా సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమిత్ షాను భర్తరఫ్ చేయాలని, అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే మాట ఎందుకు చెప్పడం లేదు. అమిత్‌ షాపై తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాయి. అంబేద్కర్‌ను అవమాన పరిచేలా దేవుడిని మొక్కితే ముక్తి దొరుకుతుందని చెప్పడం జాతిని అవమానపరిచ్చినట్టే. 

Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు

బీజేపీ స్టాండ్ అంబేద్కర్‌పై ఏముందో కిషన్ రెడ్డి, బండి సంజయ్, మనస్మృతి వాదులు చెప్పాలి. బీఆర్ఎస్‌ పార్టీ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాలి. అమిత్‌షాను వెంటనే భర్తరఫ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టాలని'' మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా.. అమిత్‌ షా కూడా తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని.. నేను మాట్లాడిన స్పీచ్‌ ఫుల్‌ వీడియో చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్‌ను అవమానించిందంటూ కౌంటర్లు వేశారు. 

Also Read: ఛీ ఛీ వీడేం డైరెక్టర్.. మహిళల బాత్రూంలో స్పై కెమెరా పెట్టి మరీ!

Also Read: అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు