'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే

డైరెక్టర్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో 'ఇండియన్‌ 2’ రిజల్ట్‌ గురించి మాట్లాడారు. సినిమాకు అంత నెగిటివ్ టాక్ వస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ, ఫర్వాలేదు. ఇప్పుడు రానున్న గేమ్‌ ఛేంజర్‌, ఇండియన్‌ 3 చిత్రాలతో ఉత్తమమైన వర్క్‌ను ప్రేక్షకులకు అందించనున్నానని అన్నారు.

New Update
shankar

 యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'భారతీయుడు 2'. జులై 12 న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను  అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘ఇండియన్‌’తో పోలిస్తే సీక్వెల్‌ అంతగా బాలేదని సినిమాపై విమర్శలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే ఎక్కువ నెగిటివ్ రివ్యూలే కనిపించాయి.

దీనివల్ల నిర్మాతలకు భారీ నష్టం కూడా వచ్చింది. అయితే ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' రిలీజ్ పనులతో బిజీగా ఉన్న డైరెక్టర్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఇండియన్‌ 2’ రిజల్ట్‌ గురించి ఆయన మాట్లాడారు. సినిమాకు అంత నెగిటివ్ టాక్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదని అన్నారు.

Also Read: ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్ అయిందా? నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే

అసలు ఊహించలేదు..

' 'ఇండియన్‌ 2' చిత్రానికి నెగిటివ్‌ రివ్యూలు నేను అసలు ఊహించలేదు. కానీ, ఫర్వాలేదు. ఇప్పుడు రానున్న ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘ఇండియన్‌ 3’ చిత్రాలతో నేను ఉత్తమమైన వర్క్‌ను ప్రేక్షకులకు అందించనున్నా. ఈ సినిమాలతో ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారు. 

సోషియో పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది. ఒక ప్రభుత్వ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధంలా ఈ సినిమాను చూపించనున్నాం..' అని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో 'గేమ్‌ ఛేంజర్‌' గురించి మాట్లాడుతూ.. సినిమా విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని, రామ్‌చరణ్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇదని చెప్పుకొచ్చారు.  

Also Read: రణ్ బీర్ తో అలాంటి ఫోటోలో కనిపించిన పాకిస్థాన్ బ్యూటీ.. తర్వాత పాపం ఆమె జీవితం....

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు