విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు బయట కూడా మాంచి హుషారుగా ఉంటాడు. గ్రౌండ్‌లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తాడు, రకరకాల గెస్చర్స్ చేస్తూ అందరినీ కవ్విస్తూ ఉంటాడు. అలాగే ఎవరైనా తనను టార్గెట్ చేస్తే వాళ్ళకు కౌంటర్లు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఇస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్ల చూపు విరాట్ కోహ్లీ మీదనే ఉంది. ఛాన్స్ దొరికితే చాలు అక్కడి మీడియా, ఫ్యాన్స్ అందరూ కోహ్లీ మీద దాడి చేస్తున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కూడా ఆసీస్ అభిమానులు అతనిని ఎగతాళి చేశారు. వెళ్ళిపోతున్న విరాట్ వెనక్కు వచ్చి వారి మీద సీరియస్ అయ్యాడు. ఇప్పుడు జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో కూడా ఆసీస్ పీపుల్ కోహ్లీతో పాటూ మిగతా భారత ఆటగాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. వారికి విరాట్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలేమైందంటే... సినీ టెస్ట్‌కు బుమ్రా కెప్టెన్. అయితే నిన్న ఆట మధ్యలో అతను మైదానం నుంచి వెళ్ళిపోయాడు. దీనికి ఆసీస్ ఫ్యాన్స్ బుమ్రా షూలో సాండ్ పేపర్ ఉందంటూ వీడియోలు షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాలని కామెంట్లు చేశారు. గాయం కారణంగా ఈరోజు కూడా బుమ్రా మ్యాచ్ ఆడటానికి రాలేదు. దీంతో ఆసీస్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోయారు. ఆట అవుతున్నా వారు అరుస్తూనే ఉన్నారు. కరెక్ట్‌గా ఇదే సమయంలో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరెస్ట్ అయ్యాడు. అప్పుడు విరాట్ వారి ఫ్యాన్స్‌ను చూస్తూ తన జేబుల్లో చేతులు పెట్టి..నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి అంటూ సైగలు చేశాడు. స్టీవ్ స్మిత్ సాండ్ పేసర్ స్కాం లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. దానికి తోడు ఆస్ట్రేలియన్లు బుమ్రా షూలో సాండ్ పేపర్ ఉందని కామెంట్ చేశారు. అందుకే విరాట్ ఆ దగ్గర సాండ్ పేపర్ లేదని సైగ చేసి చూపించాడు. భారత ఫ్యాన్స్ ఖుషీ... విరాట్ చేసిన పనికి భారత అభిమానులు సంతోషడుతున్నారు. విరాట్ చాలా మంచి కౌంటర్ ఇచ్చాడని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమ టీమ్ ఆటగాళ్ళు ఆసీస్ ఆటగాళ్ళల్లా మోసం చేయరంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. "What is that about?"#AUSvIND pic.twitter.com/HwNZXhKW1S — cricket.com.au (@cricketcomau) January 5, 2025 Also Read: USA: అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ నేతలు ప్రమాణ స్వీకారం