అమెరికాలో భారతీయుల ప్రాబల్యంతో పాటూ ప్రతినిధ్యం కూడా పెరుగుతోంది. అమెరికా రాజకీయాల్లో కూడా భారతీయ మూలాలున్న అమెరికన్ల సంఖ్య బలమౌతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక రామస్వామి తనదైన ముద్ర వేశారు. దాని తరువాత ట్రంప్ టీమ్ లో ముఖ్యమైన పాత్ర పోషించనున్నారు వివేక్. ఇప్పుడు మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రతినిధుల సభలో ఆరుగురు భారతీయ అమెరికన్లు నేతలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: TS: గ్రామ సభల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
డెమోక్రటిక్ పార్టీ నుంచి..
ప్రమాణ స్వీకారం చేసిన నేతలంతా డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికయిన వారు. ఇందులో అత్యంత సీనియర్ అయిన అమీ బెరా ఏడోసారి, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ మూడోసారి ప్రమాణం చేశారు. ఈ ఆరుగురు సమోసా కాకస్‌గా వ్యవహరిస్తారు. అమీ బెరా 12 ఏళ్ళుగా ప్రతినిధుల సభలో సభ్యడిగా ఉన్నారు. మొట్టమొదటిసారి ఈయన ప్రమాణం చేసినప్పుడు ఆయన ఒక్కరే భారతీయుడు. అమీబెరా వయసు 59 ఏళ్ళు. ఆయన ప్రమాణం చేసేటప్పటికి అమెరికా రాజకీయ చరిత్రలో మూడో వ్యక్తిగా ఉన్నారు. ఇక వర్జీనియాకు చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం ఈసారి సభకు కొత్తగా వచ్చారు. ఇక శ్రీ తనేదార్‌అనే వ్యక్తి మిషిగన్ నుంచి, మరో నేత రో ఖన్నా కాలిఫోర్నియా నుంచి సభ్యలుగా ప్రమాణం చేశారు. రాజీకృష్నమూర్తి ఇల్లినాయిస్ నుంచి ప్రమీలాజయపాల్ వాషింగ్టన్ ఉంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. రాజాకృష్ణమూర్తి చైనా కమిటీలో ర్యాంకింగ్ మెంబర్‌గా ఉన్నారు. సభ నిఘా కమిటీలోనూ ఆయన సభ్యుడుగా ఉన్నారు. ఇక ప్రమీలా జయపాల్ తొలి భారతీయ అమెరికన్ మహిళగా ఇంతుముందేచరిత్ర సృష్టించారు.
Also Read: Cricket: లక్ష్య ఛేదనలో ఆసీస్...మూడు కీలక వికెట్లు డౌన్