/rtv/media/media_files/2025/06/30/india-fast-tracks-launch-of-52-military-satellites-after-operation-sindoor-2025-06-30-12-31-37.jpg)
India fast tracks launch of 52 military satellites after Operation Sindoor
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు భారత్ చుక్కలు చూపెట్టిన సంగతి తెలిసిందే. అంతరిక్షంలో కూడా నిఘాను మరింత పెంచేందుకు భారత్ చర్యలు చేపట్టింది. చైనా, పాకిస్థాన్ , హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు 52 మిలిటరీ ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంది. నిరంతరం పర్యవేక్షణ ఇతర అవసరాల కోసం రూ.26,968 కోట్లు వెచ్చించనుంది. చైనా అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ కూడా ఈ చర్యలు చేపట్టింది.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
స్పేస్ బేస్ సర్వైలెన్స్ ఎస్‌బీఎస్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో 21 శాటిలైట్‌లను పంపించనుంది. ఆ తర్వాత మిగిలిన 31 ఉపగ్రహాలను మూడు వేరే ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసి అంతరిక్షంలోకి పంపించనున్నాయి. అయితే మొదటి శాటిలైట్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 2029 నాటికి మొత్తం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చనున్నారు. ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్ కోసం కూడా భారత్ భారీగా ఉపగ్రహాలను మోహరించింది. మన దేశంలో ప్రస్తుతం 911 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇస్రో ఈ శాటిలైట్ల నుంచి నిరంతర డేటాను దళాలలకు పంపించింది. అలాగే ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి కూడా ఫొటోలు సేకరించింది.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
ఇస్రో వినియోగించే కార్టోశాట్ సిరీస్‌లో ఉన్నవాటిని కూడా రంగంలోకి దించింది. వీటి ద్వారానే మన ఆర్మీ పక్కా ప్లానింగ్ చేసి పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. అమెరికాకు చెందిన మ్యాక్సర్, యూరప్‌కు చెందిన సెంటినెల్ సేవలు కూడా భారత్ వినియోగించింది. వీటిని రోజుకు అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక భారత్‌కు చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకు ఒకసారి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయితే యుద్ధరంగంలో భారత్ చేతిలోకి రియల్‌టైమ్ డేటా వేగంగా అందేందుకు ఆస్కారం ఉంటుంది.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!