/rtv/media/media_files/2025/07/12/sexual-harassment-2025-07-12-21-52-30.jpg)
Sexual harassment in college
Sexual harassment : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. వివరాల ప్రకారం...ఒడిశా రాష్ర్టం బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఓ విద్యార్థిని ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. సదరు విద్యార్థినిని ఓ విభాగాధిపతి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. తనతో గడపాలని లేదంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. వేధింపులు భరించలేని ఆ విద్యార్థిని జూన్ 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. వేధింపులకు గురిచేస్తున్న ఉపాధ్యాయుడిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించించింది. అంతేకాక తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా కాలేజీ క్యాంపస్‌లో నిరసన చేపట్టింది.
Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
శనివారం ఉదయం కూడా తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు కూర్చుంది. తనకు న్యాయం జరగడం లేదనే ఆవేదనతో ప్రిన్సిపల్ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగెత్తింది. అక్కడే పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. మంటలతో పరుగెత్తుతుండగా తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
అయితే ఈ విషయమై కాలేజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు సంబంధించి విద్యార్థిని ఫిర్యాదు చేసిందని, దీనిపై అంతర్గత కమిటీ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. శనివారం ఉదయం కూడా ఇదే విషయంపై బాధిత విద్యార్థిని తనను కలిసి మాట్లాడిందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ ఓడీని అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామంతో కాలేజీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!