Delhi: స్కూల్‌లో దారుణం.. మైనర్‌ బాలుడిపై అత్యాచారం

ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

New Update
Sexual Assault on 14 years old boy in Delhi

Sexual Assault on 14 years old boy in Delhi

ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది.14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. ఈ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం బాధిత బాలుడికి వైద్య పరీక్షలు చేయించి, కౌన్సెలింగ్ ఇప్పించారు.

Also Read: సంచలన వీడియోలు.. మానస దేవి ఆలయంలో తొక్కిసలాట ఎలా జరిగిందో చూశారా?

Sexual Assault On 14 Years Old Boy

వైద్యుల నుంచి సర్టిఫికేట్ అందిన తర్వాత ఆ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా ఢిల్లీలో మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో సగటున రోజుకు ఐదుగురు వ్యక్తులు అరెస్టవుతున్నారు. అలాగే రోజుకు నాలుగు పోక్సో చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి అక్కడ నేరాల తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

Also Read:  మరో బోయింగ్‌ విమానంలో చెలరేగిన మంటలు.. బయటికి దూకిన ప్రయాణికులు

ఇదిలాఉండగా ఇటీవల బిహార్‌లో దారుణం జరిగింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే భోద్‌ గయలోని పరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం హోంగార్డు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి హాజరయ్యింది. దేహదారుఢ్య పరీక్ష చేసే సమయంలో ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడున్న అధికారులు అంబులెన్స్‌కు చేసి ఆస్పత్రికి తరలించారు. 

Also Read :  అసలు వీళ్లు తల్లిదండ్రులేనా.. కన్న బిడ్డలన్నే చంపి భక్షించి.. ఆ తర్వాత ఏం చేశారంటే?

Also Read :  టర్కీలో మంటలు.. చైనాలో వరదలు.. వణికిపోతున్న ప్రజలు

delhi | rape | telugu-news

Advertisment
తాజా కథనాలు