/rtv/media/media_files/2025/07/27/ancient-humans-eating-kids-2025-07-27-17-42-49.jpg)
Ancient Humans Eating Kids
ఈ ప్రపంచంలో ఏ జంతువు కూడా కన్న బిడ్డల్ని చంపదనే విషయం తెలిసిందే. కానీ సొరచేపలు, కొన్ని రకాల తేళ్లు, ఆహారం దొరక్కపోతే ధ్రువపు ఎలుగుబంట్లు కన్న పిల్లలను చంపి ఆకలిని తీర్చుకుంటాయి. అయితే జంతువులే కాదు.. మానవులు కూడా ఇలాగే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం చేశారని తాజాగా స్పెయిన్ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
Scientist Just Learned Our Ancestors Ate Toddlers https://t.co/cvAHAkNOrZ
— Raised By Feral Cats 🏴☠️ 🏁 #SuperBi (@rmltpie) July 27, 2025
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
చిన్న పిల్లల మెడ ఎముకలను కోసినట్లు..
సుమారుగా 8.5 లక్షల ఏళ్ల నాటి ఆనవాళ్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టి తెలిపారు. స్పెయిన్‌లోని గ్రాన్ డొలినా ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో రెండు నుంచి నాలుగేళ్లు మధ్య వయస్సు ఉన్న ఓ చిన్నారి మెడ ఎముక దొరికింది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టగా ఒక పదునైన వస్తువుతో నరికినట్లు తెలిపింది. అయితే ఇలా తక్కువ వయస్సు ఉన్నవారే ఉండటంతో పూర్తి పరిశోధనలు చేశారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
ఇలాంటి ఘటనలు ఎక్కువగా హోమో యాంటెసెసర్స్ కాలంలో జరిగాయి. తల, వెన్నుపూసను పూర్తిగా విడదీయడానికి విడదీసేందుకు పదునైన వస్తువుతో నరికినట్లు స్పష్టమైన కోతలను శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లల్ని కూడా ఇతర జంతువుల మాదిరిగానే చంపేవారని చెప్పేందుకు ఇదే ప్రూఫ్. పురాతన మానవులు తమ వంశాంకురాలను ఆహార వనరుగా ఉపయోగించుకునే వారని పరిశోధనల్లో తేలింది.