Natural disasters: టర్కీలో మంటలు.. చైనాలో వరదలు.. వణికిపోతున్న ప్రజలు

చైనా, టర్మీలో ప్రకృతి వైపరిత్యాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాని కుండపోత వర్షాలు వణికిస్తుంటే.. అటు టర్కీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చు మంటలు కమ్ముకున్నాయి. ఉత్తర చైనా బీజింగ్‌లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

New Update
fires in Turkey and floods in China

చైనా, టర్మీలో ప్రకృతి వైపరిత్యాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. చైనాని కుండపోత వర్షాలు వణికిస్తుంటే.. అటు టర్కీలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్చిచ్చు మంటలు కమ్ముకున్నాయి. ఉత్తర చైనాలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. బీజింగ్‌లో ఒక్క రాత్రిలోనే 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెస్క్యూ టీంలు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇక టర్కీని కార్చిచ్చు మంటలు చుట్టుముట్టాయి. ఇస్తాంబుల్‌లో ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. బుర్సా అటవీ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. భయంతో ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి పారిపోతున్నారు. అధికారులు, పోలీసులు సహాయక చర్యల్లో భాగంగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా విధుల్లో 1100 మంది ఫైర్‌ సిబ్బంది ఉన్నారు. 1765 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణ పరిస్థితులతో మంటలు ఎగిసిపడుతున్నాయి. టర్కీలో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతున్నాయి.

Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు