/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై నాలుగు బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు భయపడుతున్నారు. స్థానికులు, వాహనదారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైరింజన్లు, పోలిసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున (డిసెంబర్ 16, 2025) దట్టమైన పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బస్సులు, మూడు కార్లు సహా అనేక వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కనీసం నలుగురు మృతి చెందగా,150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : హిమాలయాల్లో మిస్సైన అణు పరికరం.. బయటపడితే ప్రమాదమే
పొగమంచుతో తగ్గిన విజిబిలిటీ
ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు (Dense Fog) కారణంగా దృశ్యమానత (Visibility) పూర్తిగా తగ్గిపోయింది. మథురలోని బల్‌దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలురాయి 127 సమీపంలో ఉదయం 4:00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో, ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద తీవ్రత కారణంగా వాహనాలు భారీగా ధ్వంసమై, తక్షణమే మంటలు వ్యాపించాయి. లోపల చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు.
Also Read : కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్
సహాయక చర్యలు:
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, ఎస్పీ సహా పోలీసు, అగ్నిమాపక దళాలు, ఎన్.హెచ్.ఏ.ఐ (NHAI), ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు చేపట్టారు. సుమారు20 అంబులెన్సుల సాయంతో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాలిపోయిన వాహనాల కారణంగా మృతులను గుర్తించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదాలలో ఇది ఒకటి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని, వాహనాలను నెమ్మదిగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు.
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
— ANI (@ANI) December 16, 2025
Follow Us