/rtv/media/media_files/2025/12/15/nuclear-device-lost-in-the-himalayas-60-years-ago-threatens-ganga-today-2025-12-15-21-26-04.jpg)
Nuclear device lost in the Himalayas 60 years ago threatens Ganga today
హిమాలయాల్లో 60 ఏళ్ల క్రితం వదిలివెళ్లిపోయిన అణుధార్మిక పరికరం ఇప్పుడు గంగానదికి ముప్పుగా మారింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దీనిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరలవుతోంది. అసలు ఈ అణురహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1960లో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో చైనా అణు కార్యక్రమం ప్రారంభించింది. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికా CIA, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కలిసి ఓ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ ఆపరేషన్‌లో భాగంగానే భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన నందా దేవి శిఖరంపై అణు ధార్మికత కలిగిన వినికిడి డివైజ్‌ను అమర్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ డివైజ్ అనేది రేడియోఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ (RTG) ద్వారా పనిచేస్తుంది. దీనికి కిలోల్లో ప్లుటోనియం కావాలి. సరిహద్దు వెంట చైనా క్షిపణులు, అణు పరీక్షలపై నిఘా ఉంచే సెన్సార్లకు ఇది ఎంతో కీలకం.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్
ఈ అణుధార్మికత పరికరాన్ని నందాదేవి శిఖరంపైకి తీసుకెళ్లడం కోసం ఇండియన్ నావీకి చెందిన ఓ ఉన్నతాధికారి నేతృత్వంలోని టీమ్.. అమెరికా టీమ్‌తో కలిసి పనిచేసింది. వీళ్లందరూ కలిసి ఆ శిఖరం నాలుగో క్యాంప్ వరకు RTGతో పాటు యాంటెనా, 7 ప్లుటోనియం క్యాప్సుల్స్ అలాగే రెండు ట్రాన్స్‌రిసీవర్ల సెట్లను తీసుకెళ్లగలిగారు. అక్కడి నుంచి హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే షేర్పాల సాయంతో శిఖరం పైకి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో మంచు తుపాను రావడంతో వాతావరణం అనుకూలించలేదు. దీంతో అక్కడున్న టీమ్‌ల సభ్యులు వెనక్కి వచ్చేశారు.
ఆ తర్వాతి సంవత్సరం భారత బృందం మళ్లీ అక్కడికి వెళ్లింది. కానీ ఆ పరికరం కనిపించలేదు. అయితే మంచు తుపాను వల్ల అది కొట్టుకుపోయి ఉంటుదనే అనుమానించారు. అలాగే అక్కడ న్యూట్రాన్ డిటెక్టర్లతో వెతికినా కూడా ప్లుటోనియం లభించలేదు. దీంతో వాళ్లు షాకైపోయారు. అప్పటినుంచి ఆ డివైజ్ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఈ డివైజ్‌లో ఉన్న ప్లుటోనియం పీయూ 239 అనేది అమెరికా నాగసాకిపైకి ప్రయోగించిన అణుబాంబులో మూడోవంతు ప్లూటోనియంకు సమానం కావడం గమనార్హం.
రేడియోఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ (RTG)ని అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో కరెంట్ ఉత్పత్తి చేసేందుకు వాడుతుంటారు. ఇది కొన్ని దశాబ్దాల వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది అణుబాంబు తరహాలో పేలిది కాకపోయినా.. ఈ పరికరం దెబ్బతింటే దాని నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా అమెరికా, భారత్ టీమ్‌లు ఈ డివైజ్ ఆచూకి కోసం గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
ఈ పరికరం హార్డ్‌వేర్‌ను భారత బృందమే గుర్తించి స్వాధీనం చేసుకుందని కొందరు భావిస్తున్నారు. కానీ అది ఇప్పటికీ నందా దేవి శిఖరం మంచులోనే కురుకుపోయి ఉంటుందని ఎక్కువగా నమ్ముతున్నారు. ఇక 1978లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఈ పరికరానికి సంబంధించి ఓ విషయం వెల్లడించింది. స్థానిక నదీ జలాల్లో ప్లుటోనియం కలిసినట్లు ఆనవాళ్లు లేవని తెలిపింది. కానీ ఆ పరికరం ఏ ప్రాంతంలో ఉందనే దానిగురించి మాత్రం చెప్పలేదు.
Also Read: ఆస్ట్రేలియాలో ఎప్పటినుంచో యూదు వ్యతిరేకత.. కాల్పులకు దారి తీసిన కారణాలు ఇవే !
రిషి గంగా, ధౌలీ గంగా నదులు అనేవి నందా దేవి హిమనీనదాల నుంచే వస్తాయి. ఆ తర్వాత ఈ రెండూ కూడా అలకనంద, భాగీరథిలో కలిసిపోతాయి. అప్పుడు దీన్ని గంగా నదిగా పిలుస్తారు. ఈ నదీ నీటిని దేశంలో కోట్లాది మంది వాడుతుంటారు. RTG డివైజ్ మంచు ఫలకల కింద కురుకుపోయి లోతులో సమాధి అయి ఉంటే దానివల్ల తక్షణమే ముప్పు ఉండదని నిపుణులు అంటున్నారు.
అలా కాకుండా కాలం గడుస్తున్న కొద్ది ఆ పరికరం దెబ్బతిని అందులో ఉండే రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే నదీ జలాలు కలుషితం అవుతాయి. ఇలా జరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం వరదలు పెరిగిపోవడం, సున్నితంగా ఉండే ప్రాంతాల్లో సైనిక, అణు ఆపరేషన్‌లు పెరగడం వల్ల ఈ డివైజ్‌పై భయాందోళనలు నెలకొన్నాయి.
Follow Us