/rtv/media/media_files/2025/07/28/srishti-test-tube-baby-center-case-sensational-facts-2025-07-28-08-41-04.jpg)
Srishti Test Tube Baby Center Case Sensational facts
Srushti IVF Center: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనైతిక టెస్ట్ ట్యూబ్ బేబీ వ్యవహారంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాలను నిర్వహిస్తున్న డాక్టర్ అత్తలూరి నమ్రత ఎలియాస్ పచ్చిపాల నమ్రత పోలీసులకు బిగ్ షాక్ ఇచ్చింది.
డాక్టర్ నమ్రత తనను అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులకు అధికారం లేదని అడ్డం తిరిగింది. అనైతిక టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో వైద్యం చేసి భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో తమను మోసం చేసిందని ఒక జంట ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో నమ్రత తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ లో ఆమె తరఫున లాయర్లు కీలక విషయాలపై ప్రశ్నలు సంధించారు.
Also Read: స్పెర్మ్ టెక్ ఆఫీస్ సోదాల్లో షాకింగ్ దృశ్యాలు..డబ్బాల్లో వీర్యకణాలు..అండాలు
తనపై ఫిర్యాదు చేసిన కేసు, నేరం జరిగిందని చెబుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని, అయితే తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది మాత్రం తెలంగాణ పోలీసులు అని వారు తెలిపారు. ఈ విషయంలో లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులకు ఎలాంటి అధికారం లేదని వారు వాదించారు. అంతేకాక అది చట్ట విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. "ఇది జ్యూరిడిక్షన్ ఉల్లంఘన" కిందకు వస్తుందన్న కోణంలో వారు పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాక, "35 ఏళ్లుగా మహిళల వైద్య సేవలలో పని చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదు. ఇప్పుడు అసత్య ఆరోపణలతో మాకు పరువు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు" అని డాక్టర్ నమ్రత తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు చేయడాన్ని వారు పునరాలోచించాల్సిన విషయంగా కోర్టుకు తెలిపారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో MLA టికెట్ వాళ్లకే.. తేల్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కాగా, ఈ కేసు విషయంలో డాక్టర్ నమ్రత పలు ఆరోపణలు చేయడంతో తెలంగాణ పోలీసులు పునారాలోచనలో పడ్డారు. చట్టపరిమితులు, ఇరు రాష్ర్టాల పోలీసుల చొరవ, కేంద్ర చట్టాలకు అనుగుణంగా సరోగసీ నియంత్రణ, తదితర అంశాలు ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. నమ్రత రెండు రాష్ర్టాల్లో సరోగసి కేంద్రాలు నిర్వహిస్తు్న్నందున ఇందులో అసలైన నేరం ఏ రాష్ట్రంలో జరిగింది? కేసు దర్యాప్తు ఎవరు చేయాలి? అరెస్ట్‌లు ఎవరు చేయాలి? వంటి ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ పోలీసులకు సవాలుగా మారింది.
కాగా, నమ్రత బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందున ప్రస్తుతం కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్న విషయంలో రెండు రాష్ట్రాల పోలీసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కోర్టు పిటిషన్‌ను సమర్థిస్తే, ఇది రాష్ట్రాల మధ్య చట్టపరమైన హద్దులపై కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. రాష్ట్రాల చట్ట అధికార పరిమితులు, కేసు ఏ రాష్ట్రం విచారించాలి? అన్న దానిపై కోర్టు తీర్పు ఆధారపడి ఉంటుంది.
Also read: పాకిస్థాన్ గుండెలపై దాడి చేశాం...దాడులు ఆపాలని ట్రంప్ చెప్పలేదు: మోదీ