/rtv/media/media_files/2025/11/08/scooter-2025-11-08-20-24-53.jpg)
Scooter Costs A Lakh, Rider Fined 21 Lakh lakhs
ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో జిల్లా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు రూ.21 లక్షల ఫైన్ పడింది. తన చలానా చూసిన ఆ వ్యక్తి షాకైపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 4న అన్మోల్ సింఘాల్ అనే వ్యక్తి తన స్కూటీపై బయటికి వెళ్లాడు. అయితే న్యూ మండి ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినందుకు ఫైన్ విధించారు.
Also Read: 20 మందిని రేప్ చేసి, హత్యలు చేసిన ఖైదీకి జైల్లో సకల సౌకర్యాలు.. VIDEO
అతడు తన చలానా చెక్ చేయగా అందులో రూ.20,74,000 జరిమానా ఉంది. ఇది చూసి షాకైపోయిన అతడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అది వైరల్ అవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు దృష్టికి చేరింది. ఆ జరిమానాను రూ.4 వేలుగా సవరించారు. ఈ ఘటనపై ముజఫర్ నగర్ ట్రాఫిక్ ఎస్పీ స్పందించారు. స్కూటీ వ్యక్తికి చలానా జారీ చేసిన SI పొరపాటు వల్ల ఇలా భారీగా ఫైన్ పడ్డట్లు తెలిపారు.
Also Read: హెచ్-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్‌వాల్’.. వారిపై 175 కేసులు
మోటారు వాహన చట్టంలో సెక్షన్ 207 కింద ఫైన్ విధించాడని.. ఆ తర్వాత ఎంవీ యాక్ట్ పేర్కొనడాన్ని ఆ ఎస్‌ఐ మర్చిపోయినట్లు చెప్పారు. దీనివల్ల ఈ సెక్షన్ కింద ఉన్న కనీస జరిమానా రూ.4 వేలతో పాటు 207 కలిపి మొత్తం 20,74,000 సంఖ్యగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి రూ.4 వేలు జరిమానా చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.
Also Read: ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్
Follow Us