Bengaluru Jail: 20 మందిని రేప్‌ చేసి, హత్యలు చేసిన ఖైదీకి జైల్లో సకల సౌకర్యాలు.. VIDEO

అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్‌ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు.

New Update
Rapist, Criminals Seen Using Phones and Watching Tv Inside Bengaluru Jail

Rapist, Criminals Seen Using Phones and Watching Tv Inside Bengaluru Jail

Bengaluru Jail: అత్యాచారాలు, హత్యలు చేసిన ఖైదీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 20 మందిని మహిళలను రేప్‌ చేసి, హత్యలు చేసిన ఓ దోషి సకల సౌకర్యాలు అనుభవిస్తున్నాడు. జైల్లో ఎంచక్కా మొబైల్‌ ఫోన్లు వాడుతూ.. టీవీ చూస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ ఉమేష్ రెడ్డి అనే దోషి శిక్ష అనుభవిస్తున్నాడు. 1996-2022 మధ్య అతడు 20 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. వాళ్లలో 18 మందిని హత్య చేశాడు. దీంతో అతడికి కోర్టు ముందుగా మరణశిక్ష విధించింది. ఆ తర్వాత అతను తన మానసిక పరిస్థితి బాలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో అత్యున్నత న్యాయస్థానం అతడికి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది.  

Also Read: విద్యార్థులకు పేపర్లో మధ్యాహ్న భోజనం.. స్పందించిన రాహుల్ గాంధీ

అయితే ఆ జైల్లో ఉమేష్‌ రెడ్డి మొబైల్‌లో ఫోన్‌ మాట్లాడుతూ కనిపించాడు. రెండు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ఓ కీప్యాడ్‌ మొబైల్‌ను అతడు వాడుతున్నాడు. ఇతర ఖైదీలు కూడా మొబైల్‌ ఫోన్లను వాడుతూ కనిపిస్తున్నారు. ఉమేష్ రెడ్డి ఉన్న గదిలో టీవీ కూడా ఉంది. అంతేకాదు రన్యారావు బంగారు స్మగ్లింగ్ కేసులో ఇటీవల తరుణ్‌ రాజు అరెస్టయిన సంగతి తెలిసిందే. అతడు కూడా ఆ జైల్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నాడు.  

Also Read :  ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్‌.. త్వరలోనే పెళ్లి!

ఆ సెంట్రల్‌ జైల్లో ఖైదీలు, రేపిస్టులు, హంతకులు మొబైల్ ఫోన్లు వాడుతూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. చివరికి ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. దీనిపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: బీహార్ ఎన్నికల్లో కలకలం.. రోడ్లపై VVPAT స్లిప్స్‌.. VIDEO

Advertisment
తాజా కథనాలు