/rtv/media/media_files/2025/10/25/lic-and-adani-2025-10-25-15-43-41.jpg)
Savings of LIC's 30 crore policyholders 'systematically misused' to benefit Adani, Says Congress
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీదారుల సేవింగ్స్‌ను దర్వినియోగం చేశారని విమర్శించింది. అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసం సామాన్య పౌరుల జీవితకాల సేవింగ్స్‌ను దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు LICతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఆరోపించింది. దీనిపై పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
Also Read: ఐఆర్‌సీటీసీ సేవలు డౌన్, నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్..!
'' కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల మంది LIC పాలసీదారుల పొదుపును అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టించి, వాటిని ఎలా దుర్వినియోగం చేశారనే విషయాలు బయటపడ్డాయి. 2025లో మే నెలలో వివిధ అదానీ గ్రూప్ కంపెనీల్లో సుమారు రూ.33 వేల కోట్ల LIC నిధులను పెట్టుబడి పెట్టేందుకు భారత అధికారులు ప్రతిపాదన రూపొందించినట్లు పలు అంతర్గత పత్రాలు వివరిస్తున్నాయని'' కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల్లో ఒక ప్రైవేటు సంస్థను గట్టెక్కించేందుకు LIC నిధులు వాడేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌కు ఏ అధికారం ఉందని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
గతేడాది సెప్టెంబర్‌లో గౌతమ్ అదానీ, అతడి సహచరులు.. తమ కంపెనీ గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించినందుకు అమెరికాలో వాళ్లపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో LIC నాలుగు గంటల ట్రేడింగ్‌లో రూ.7850 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాధనాన్ని తన మిత్రులకు పంచారని.. అందుకే అప్పుడు ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే అదానీ గ్రూప్ కోసమే ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు వంటి కీలక మౌలిక సదుపాయల ఆస్తులను కేంద్రం ప్రైవేటీకరణ చేసినట్లు ఆరోపణలు చేశారు. అలాగే విదేశాల్లో కూడా అదానీ గ్రూప్‌కు కాంట్రాక్టులు అప్పగించేందుకు దౌత్య వనరులు దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జైరాం రమేశ్ చేసిన ఆరోపణలపై కేంద్రం గానీ అదానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Disturbing revelations have just emerged in the media about how the Modani joint venture systematically misused the Life Insurance Corporation of India (LIC) and the savings of its 30 crore policyholders.
— Congress (@INCIndia) October 25, 2025
Internal documents reveal that Indian officials drafted and pushed… pic.twitter.com/lI7gz66kWo
Also Read: జమ్మూ-కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే..యూఎన్‌లో మరోసారి స్పష్టం
Follow Us