Congress: దేశంలో పదేండ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ- జైరాం రమేష్
1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను ఏటా రాజ్యాంగ హత్యా దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. మోదీ కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.