Terror attack: భారత్‌లో కలవనున్న POK.. పాక్ చర్యలకు సరైన సమాధానం అదే!

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేయడమే పాకిస్తాన్‌లో ఉన్న సమస్యకు పూర్తి పరిష్కారమని ప్రముఖలు అంటున్నారు. ఇదే మాట మంత్రులు జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ లు కూడా మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పహల్గామ్ అటాక్‌కు పాల్పడ్డారు.

New Update
PoK with India

కాశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి పాక్ ఆక్రమిక కాశ్మీర్ భూభాగాలు తిరిగి తీసుకోవడమే మార్గమని విదేశాంగ శాఖమంత్రి ఎస్ జై శంకర్ నెల రోజుల క్రితం ఓ ఇంటర్య్యూలో అన్నారు. లండన్‌లోని చాథమ్ హౌస్‌లో జైశంకర్ మాట్లాడుతూ.. కాశ్మీర్‌ సమస్య మా ప్రభుత్వం వాస్తవానికి చాలావరకు పరిష్కరించిందన్నారు. ఆర్టికల్ 370ని తొలగించి మంచిపని చేశామని మీడియాకు చెప్పారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా తిరిగి తీసుకుంటామని చెప్పారు. ఇదే మాట ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అన్నారు. ఆ దిశగా కేంద్రం పావులు కూడా కదుపుతోందని వార్తలు వస్తున్నాయి.

Also read: INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్

భారత్‌కు కాశ్మీర్‌ పెద్ద తలనొప్పిగా ఉంది. భారత్‌లో జరిగే ఉగ్రవాద చొరబాట్లు, దాడుల్లో దీనికి పూర్తి పరిష్కారం భారత్‌లో విలీనం చేయడమేనని కేంద్ర భావిస్తోంది. ఇలా అనుకోడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంలో విజయవంతం అయ్యింది. ప్రశాతంగా అక్కడ ఎన్నికలు కూడా నిర్వహిస్తోంది. ఇది క్రమంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కూడా భారత్‌లో కలిపేస్తే ఈ సమస్య పూర్తిగా సర్థమనుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019లో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశారు. దీంతో మనపటి కంటే అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ తగ్గిందని భారత ప్రభుత్వం చెబుతుంది. అంతకు ముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలు ఆ ప్రాంతంలో యువతను రెచ్చగొడుతూ ఉగ్రవాదంలోకి లాగుతుండేవారు. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేశాక అక్కడ ఉగ్రవాద చర్యలు తగ్గాయి.

Also read: Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

పాక్ ఇండియా భూభాగంలో 13,297 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించింది. 1947 యుద్ధం సమయంలో పాక్ కాశ్మీర్ తమ దేశానికి చెందిందే అని సైన్యంతో ఆక్రమించుకుంది. ఇరు దేశాలు యుద్ధానికి దిగడంలో ఐక్యరాజ్య సమితి కలుగజేసుకొని స్టాండ్ స్టిల్ అంగ్రిమెంట్ చేసింది. ఇరు దేశాలు ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాలి దీని అర్థం. దీంతో పాక్ భారత్‌లో ఆక్రమించిన ప్రాంతం వరకు కంచె వేసి తన ఆధీనంలో ఉంచుకుంది. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని భారత్ తమ ప్రాంతమని, పాకిస్తాన్ కూడా అది తమ ప్రాంతమని చెప్పుకుంటుంది. ఈ వివాదస్పద ప్రాంతంలో ఇరు దేశాలు లక్షల కోట్లు సైన్యం కోసం ఖర్చు చేస్తున్నాయి. యుద్ధం వచ్చినా పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. పాక్‌ను ఓడించే ఆయుధ సామాగ్రి, సైన్యం కూడా భారత్‌కు ఉంది. 

అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?

పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు తాము భారత్‌లో కలుస్తామని ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గిల్గిల్ ప్రాంత ప్రజలు తమకు భారత్ కార్గిల్ ద్వారాలు తెరవాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రస్తావించారు. వారు విన్నపం మేరకే పాక్ ఆక్రమిక కాశ్మీర్ త్వరలోనే ఇండియాలో కలుస్తోందని అన్నారు.

భారత్ పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయంగా కొన్ని అగ్రదేశాల మద్దత్తు కూడా కూడగట్టుకుంది.  

(PAK Army | attack in Pahalgam | Pahalgam attack | latest-telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు