INS surat: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్

భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని కూల్చివేసింది.

New Update
INS surat

భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్య చేసింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై ఓ క్షిపణిని ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసింది. ఇది భారతీయ నావికా దళ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పవాల్గామ్‌లో టెర్రర్ అటాక్ కారణంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు రద్దు అవుతున్నాయి.

Also read: Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్, పాక్ దేశాల ప్రధానులు రక్షణ శాఖ మంత్రులు, అధికారులతో సమావేశమైయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది పర్యటకులను కాల్చి చంపింది. ఇది తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. రెండు అటు పాక్‌ కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగించే చర్యలకు దిగితే వెంటనే ప్రతిచర్యలు చేయాలని పాక్ ప్రధాని ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. 

Also read: సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి..? త్రివిధ దళాల మెరుపు దాడుల్లో వీళ్లే మునగాళ్లు

నేవీ ఈ క్షిపణి పరీక్ష విజయవంత అవ్వడంతో మరో మైలురాయి దాటింది. జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగాలో ఈ క్షిపణి టెస్ట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, వివిధ రకాల మిలటరీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్‌ చేస్తూ ధ్వంసం చేసింది. ఇక టార్గెట్‌పైకి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌‌ను వినియోగించారు. నీటిపై తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులను టార్గెట్ చేసి ఇది కూల్చేస్తుంది. అటు పాకిస్తాన్‌ కూడా ఏప్రిల్ 24, 25 తేదీల్లో కరాచీ ప్రాంతంలో ఉపరితలం నుంచి ఉపరితలం ప్రయోగించే క్షిపణి టెస్ట్ చేస్తామని ప్రకటించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు