/rtv/media/media_files/2025/04/24/yyjMeHO1p3b2BNycIcW1.jpg)
పాక్, భారత్ మధ్య ఉత్రిక్తత పరిస్థితిను నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్‌తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంది. పాకిస్థాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని 72 గంటల టైం ఇచ్చింది. అలాగే సిందూ నదీ జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. దీంతో గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది.
Press Release PM Office
— Islamabad Insider (@IslooInsider) April 24, 2025
Prime Minister of Pakistan Muhammad Shehbaz Sharif chaired a meeting of the National Security Committee (NSC), today. The participants discussed the national security environment and the regional situation, particularly in the wake of #Pahalgam attack in… pic.twitter.com/JuawHaOJom
భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని రిలీస్ చేసిన ప్రెస్ మీట్ లో అన్నాడు. భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఇందులో ఎటువంటి నిబంధన లేదని పాక్ ప్రధాని చెప్పారు.
సిందూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాక్ అభిప్రాయ పడుతుంది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు విమానాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఏదైనా భంగం వాటిల్లితే వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అన్నాడు.
( attack in Pahalgam | india pakistan news | india-pakistan | war | terrorist | jammu-and-kashmir | pakistan | latest telugu news | today news in telugu)