/rtv/media/media_files/2025/02/14/Y5Sn3yWXnsisl8sIWu8u.jpg)
RBI Bars New India Cooperative Bank From Further Business
RBI: ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు(New India Cooperative Bank) బిగ్ షాక్ తగలింది. ఈ బ్యాంకులో ఇకనుంచి ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిషేధం విధించింది. ఫిబ్రవరి 13న ఆర్బీఐ.. ఈ బ్యాంకు నుంచి కొత్త లోన్లు జారీ చేయడాన్ని బ్యాన్ చేసింది. అలాగే ఆరు నెలల వరకు ఎలాంటి లావాదేవీలు(Transactions) జరగకుండా సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. '' ఫ్రిబవరి 13, 2025న న్యూ ఇండియా బ్యాంక్ మూతబడింది. కాబట్టి ఆర్బీఐ నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ఈ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి రుణాలు మంజూరు చేయకూడదు. ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని'' ఆర్బీఐ తెలిపింది.
Also Read: Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
RBI Bars New India Co-operative Bank From Further Business – Depositors In Panic #TNCards https://t.co/zBoTbQbWvw pic.twitter.com/l6ygAN2xdD
— TIMES NOW (@TimesNow) February 14, 2025
Also Read: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!
అలాగే అర్హత ఉన్న డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సురెన్స్ క్లెయిమ్‌ను రూ.5 లక్షల వరకు పొందగలరని పేర్కొంది. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం ముంబయిలోని న్యూ ఇండియా బ్యాంకు బయట కస్టమర్లు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#WATCH | Mumbai, Maharashtra: People gather outside the New India Co-operative Bank after the RBI issued a notice to halt all business pic.twitter.com/kkzXmCIMqe
— ANI (@ANI) February 14, 2025
Also Read: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
సీమా వాగ్‌మేర్ అనే బ్యాంకు కస్టమర్ మాట్లాడుతూ..
'' నిన్ననే (ఫిబ్రవరి 13) మేము బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేశాం. మాకు ఎవరూ ఏం చెప్పలేదు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై మాకు ముందుగానే చెప్పాల్సి ఉండేది. 3 నెలల్లో మేము మా డబ్బును తీసుకోవచ్చని వాళ్లు చెబుతున్నారు. కానీ మాకు ఈఎంఐలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని'' సీమా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.31 కోట్లు నష్టపోగా.. 2024 మార్చి చివరినాటికి రూ.23 కోట్లు నష్టపోయింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ ఈ బ్యాంకు కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: బిగ్ షాక్.. మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్