Donald Trump : బిగ్ షాక్..  మోదీ ముందే ఇండియాకు డొనాల్డ్‌ ట్రంప్‌ వార్నింగ్‌

అమెరికా పర్యటనలో భాగంగా  ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ. టారీఫ్‌ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు.  భారత్‌ అధిక టారిఫ్‌లు విధిస్తోందంటూ ట్రంప్‌ ఆరోపణలు చేశారు.  ట్రంప్‌ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు.

New Update
trump and modi 1

trump and modi 1

అమెరికా పర్యటనలో భాగంగా  ట్రంప్ తో దాదాపుగా నాలుగు గంటల పాటు చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ. టారీఫ్‌ల విషయంలో ట్రంప్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు.  భారత్‌ అధిక టారిఫ్‌లు విధిస్తోందంటూ ట్రంప్‌ ఆరోపణలు చేశారు.  ట్రంప్‌ ఆరోపణలు చేస్తుండగా మోదీ సైలెంట్ అయిపోయారు.  ట్రంప్‌కు అదే రీతిలో కౌంటర్‌ ఇవ్వలేకపోయారు.  ప్రపంచంలో ఎక్కువ టారిఫ్‌లు విధించేది ఇండియానే అని ట్రంప్ వ్యాఖ్యనించారు.  అమెరికా - భారత్‌ వాణిజ్యానికి టారిఫ్‌లు అడ్డంకిగా మారాయని.. అధిక టారిఫ్‌లతో ఇండియాలో ట్రేడింగ్‌ కష్టమవుతోందని ట్రంప్ చెప్పుకొచ్చారు.  మేం కూడా అదే పద్ధతిని పాటిస్తామని.. ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో.. మేం కూడా అంతే టారిఫ్‌ విధిస్తామని ట్రంప్ చెప్పుకొచ్చారు.  

ఇక భారత్ కు అత్యంత అధునాతన F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా  ట్రంప్  వెల్లడించారు.  ఇకపై ఇండియాకు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలు పెంచుతామని తెలిపారు.  తమ దేశంలోని చమురు, గ్యాసు భారత్ అధిక మొత్తంలో కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాతో పాటు మరింత మంది నిందితులను కూడా ఇండియాకు అప్పగిస్తామని ట్రంప్ వెల్లడించారు.  ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని తెలిపారు.  పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.

ముగిసిన మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ముగిశాయి. దీంతో ఆయన భారత్ కు తిరుగు పయనమయ్యారు. 2025 ఫిబ్రవరి 10న ఫ్రాన్స్ వెళ్లిన మోదీ.. అక్కడ రెండు రోజులు పాటు పర్యటించారు. ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో భేటీ అయ్యారు. అనంతరం మోదీ అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. 12, 13వ తేదీల్లో పర్యటించి అధ్యక్షుడు ట్రంప్ సహా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తులసీ గబ్బార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి తదితరులతో సమావేశమయ్యారు.  రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షడు అయ్యాక మోదీ తొలిసారి ఆయన్ను కలిశారు.  భేటీ అనంతరం ట్రంప్ ను  ఇండియాలో పర్యటించాలని మోదీ కోరారు.

Also Read : USA: వారిని పంపించేడమే కరెక్ట్..ట్రంప్ సరిగ్గానే చేస్తున్నారు..మోదీ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు