India-Japan: క్వాడ్, ఏఐ, సెమీ కండక్టర్లపై చర్చ..జపాన్ లో ప్రధాని మోదీ బిజీ బిజీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జపాన్ కు చేరుకున్నారు. ఈ రెండు రోజులూ ఆయన జపాన్ ప్రధానితో ప్రస్తుత బౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలపై చర్చించనున్నారు. దాంతో పాటూ క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు.. మొదలగు అంశాలపై డిస్కస్ చేస్తారు. 

New Update
pm modi, japan

PM Modi Reached Japan

అమెరికాతో వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ(pm modi) జపాన్, చైనా(china) పర్యటనలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని ఈరోజు ఉదయం జపాన్ లోని టోక్యోకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆయన ఘన స్వాగతం లభించింది.  జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు మోడీ జపాన్‌కు వెళ్లారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోడీ ఎనిమిది సార్లు జపాన్‌లో పర్యటించారు. మోడీ చివరిసారిగా 2018లో ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఏడేళ్ల తర్వాత అక్కడ పర్యటిస్తున్నారు. 

Also Read :  మనువడిని పార్ట్‌లుగా నరికి బలిచ్చిన తాత.. తాంత్రికుడు మాటలు నమ్మి దారుణంగా..!

క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు...

జపాన్(japan) లో ప్రధాని రెండురోజుల  పాటూ ఉండనున్నారు. ఈ రెండు రోజులూ మోదీ టైట్ షెడ్యూల్ తో బిజీబిజీగా గడపనున్నారు. క్వాడ్, ఏఐ, సెమీ-కండక్టర్లు.. మొదలగు అంశాలపై జపాన్‌ ప్రధాని, ఇతర అధికారులతో  చర్చలు చేస్తారని జపాన్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ తెలిపారు.  దీంతో పాటూ ప్రస్తుత భౌగోళిక రాజకీయ, భౌగోళిక-ఆర్థిక అంశాలపై కూడా మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో చర్చించనున్నారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచడం, ప్రాంతీయ, ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం ఈ పర్యటన లక్ష్యమని రాయబారి సిబి జార్జి చెప్పారు. కేవలం అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేయడమే కాదు అంతకు మించి మాట్లాడుకుంటారని తెలిపారు. క్వాడ్ అనేది చర్చలలో కవర్ చేయబడే చాలా ముఖ్యమైన అంశం అని సిబి జార్జి చెప్పారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక సంబంధాలను మరింతగా పెంచే లక్ష్యంతో జపాన్, భారత పరిశ్రమల నాయకులతో జరిగే వ్యాపార నాయకుల ఫోరమ్‌లో కూడా మోడీ పాల్గొననున్నారు. మరోవైపు అమెరికాకు జపాన్ షాకిచ్చింది. జపాన్‌ వాణిజ్య మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో రెండు దేశాల మధ్య జరగాల్సిన 550 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

రెండు రోజుల తర్వాత చైనాకు..

జపాన్ పర్యటన తరువాత ప్రధాన మోదీ అక్కడి నుంచి డైరెక్టుగా చైనాకు వెళతారు. ఆగస్టు 31న జరిగే ఎస్సీవో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇందులో చైనా, ఇండియాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటూ..ఒకరికొకరు సహకారాన్ని విస్తృతం చేసే విధంగా చర్చించనున్నారు. రెండు దేశాలు కట్టుబడి పని చేసేందుకు  ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో పాటూ రష్యా అధినేత పుతిన్ తో కూడా భేటీ అవ్వనున్నారు. 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారత్, చైనాలపై అమెరికా సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ ప్రధాని మోదీ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read :  రిటైర్ మెంట్ గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు..మోహన్ భగవత్

Advertisment
తాజా కథనాలు