Mohan Bhagavath: రిటైర్ మెంట్ గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు..మోహన్ భగవత్

నేనసలెప్పుడూ రిటైర్ మెంట్ గురించి మాట్లాడలేదని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తానో, మరొకరో 75 ఏళ్ళకు పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ అనలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సావాల్లో ఆయన రెండున్నర గంటలపాటూ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. 

New Update
mohan

RSS Chief Mohan Bhagavath

తానెప్పుడూ పదవిలోనే ఉండిపోవాలని అనుకోలేదు. దానికి తానెప్పుడూ సిద్ధమేనని..సంఘ్ కోనుకున్నంత కాలం పని చేస్తానని మోహన్ భగవత్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ కేవలం ఆమోధ్య రామాలయానికి మాత్రమే మద్దతు తెలిపిందని..కాశీ, మథుర లాంటి వేరే ఏ ఆలయానికి సపోర్ట్ చేయమని చెప్పారు. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంది అయితే బలవంతాలు, ప్రలోభాలుకు లొంగిపోకూడదు. అక్రమవలసదారులకు ఉద్యోగాలివ్వకూడదు. ముస్లింలు అయినా ఇంకెవరయినా సరే మన దేశంలో వారికి మాత్రమే ఇవ్వాలి అని భగవత్ అన్నారు. సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలని సంఘ్‌ కోరడం లేదని.. దేశ సంప్రదాయాలు, చరిత్ర గురించిన అవగాహన ప్రధానమని అన్నారు.

వారితో విభేదదాల్లేవ్.. 

బీజేపీకి సంబంధించి ప్రతీవిషయంలోనూ ఆర్ఎస్ఎస్ తలదూర్చదు. ఆ పార్టీ నిర్ణయాలకు తమకు సంబంధం లేదంటూ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలా అని ఆ పార్టీతో తమకు ఎటువంటి విభేదమూ లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. 

ముగ్గురు పిల్లలు తప్పనిసరి.. 

ఆర్ఎస్ఎస్ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. దీంట్లో సంతానం గురించి కూడా ఆయన మాట్లాడారు. సంతానోత్పత్తి తక్కువ అయితే సమాజాలు అంతరించిపోతాయని...అందుకే ప్రతీ భారతీయ కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని భగవత్ పిలుపునిచ్చారు. సరైన వయసులో వివాహం చేసుకోవడం, ముగ్గురు పిల్లల్ని కనడం అనేది తల్లిదండ్రులకు, పిల్లలకూ ఆరోగ్యకరమని అన్నారు. జనాభా పెరుగదల భారమైనా తప్పదని చెప్పుకొచ్చారు. అందరికీ ప్రభుత్వం ఆహారం సహా అన్ని వసతులూ కల్పించాలని అన్నారు. అయితే ముగ్గురి కంటే మాత్రం ఎక్కువ పిల్లలు మాత్రం ఉండకూడదని...ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే పెంచడం కష్టమవుతుందని అన్నారు. 

Also Read:  Javelin Throw: నీరజ్ చోప్రా ఖాతాలో మరో మెడల్.. జూరిచ్ డైమండ్ లీగ్ రన్నరప్

Advertisment
తాజా కథనాలు