/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
Crime News
ఈ మధ్యకాలంలో దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి కొందరు సొంత మనుషులనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక మాంత్రికుడు చెప్పాడని నమ్మి, కన్న తాత తన స్వంత మనువడిని అత్యంత దారుణంగా చంపేశాడు. ఈ విషాద ఘటన ఆగస్టు 26న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి దర్యాప్తు జరిపారు. చివరకు బాధిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు మిస్టరీని చేధించారు. ప్రధాన నిందితుడు శరణ్ సింగ్, అతని ఇద్దరు పిల్లలను కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని కొడుకు, కూతురు ఇద్దరూ ఒక ఏడాది తేడాతో ఆత్మహత్య చేసుకున్నారు. వరుసగా ఇద్దరు పిల్లలను కోల్పోవడంతో శరణ్ సింగ్ తీవ్రంగా బాధపడ్డాడు. ఈ దురదృష్టం ఎందుకు జరుగుతోందని తెలుసుకోవడానికి అతను ఒక మాంత్రికుడిని ఆశ్రయించాడు.
दादा बना पोते का कातिल! धड़ से अलग की गर्दन, हाथ-पैर भी काटे, फिर पॉलिथीन में लपेटकर नाले में फेंकी लाश#CrimeNews#prayagrajhttps://t.co/cXAryHnk3t
— AajTak (@aajtak) August 28, 2025
మాంత్రికుడు మాటలు నమ్మి..
మాంత్రికుడు(magician) చెప్పిన మాటలతో ఇంకా ఆగ్రహం పెరిగింది. శరణ్ సింగ్‌కు బంధువు, వరుసకు మనువడైన యశ్ (17) బ్రతికి ఉండటమే ఈ కష్టాలకు కారణమని, యశ్‌ను బలి ఇస్తే అతని కుటుంబానికి పట్టిన దురదృష్టం తొలగిపోతుందని ఆ మాంత్రికుడు చెప్పాడు. ఈ అమానుషమైన సలహాను నమ్మిన శరణ్ సింగ్, ఎటువంటి ఆలోచన లేకుండా తన మనువడిని చంపడానికి సిద్ధమయ్యాడు. ఆగస్టు 26న యశ్ స్కూల్ దగ్గర వేచి చూసిన శరణ్ సింగ్ అతన్ని కిడ్నాప్ చేశాడు. యశ్‌ను ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, మాంత్రికుడు చెప్పినట్లుగా అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆ దారుణం అంతటితో ఆగలేదు. మనువడి తలను, మొండెం నుంచి వేరు చేసి, ఒక్కో భాగాన్ని ఒక్కో చోట పడవేశాడు. ఈ అమానుషమైన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చూడండి: AP Crime : లెక్చరర్ కాదు కామాంధుడు..ల్యాబ్కు పిలిచి నడుము పట్టుకుని అసభ్యంగా!
యశ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లి కామినీ దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు నైనీ పారిశ్రామిక ప్రాంతంలో ఒక మొండెం లభించింది. కానీ అది ఎవరిదో గుర్తుపట్టలేకపోయారు. మరుసటి రోజు సైద్‌పూర్ ప్రాంతంలో యశ్ తల కనిపించడంతో పోలీసులు అతన్ని గుర్తించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఇతర ఆధారాలను పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. శరణ్ సింగ్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో శరణ్ సింగ్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. మాంత్రికుడు చెప్పిన మాటలు విని ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. దీంతో పోలీసులు శరణ్ సింగ్, అతనితో పాటు తనకి సాయం చేసిన వ్యక్తి, మాంత్రికుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Crime News: మరికొద్దిరోజుల్లో పెళ్లి..ఇంతలోనే..దారుణం