అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా.. మోదీకి సిద్ధరామయ్య సవాల్

కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందిచారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. లేనిపక్షంలో ప్రధాని మోదీ తప్పుకోవాలంటూ సవాల్ విసిరారు.

New Update
sidda

Sidharamayah Vs Modi:


కర్ణాటకలో ఎక్సైజ్ శాఖలో రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీనిపై స్పందించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు నిరూపించాలంటూ డిమాండ్ చేశారు. అని నిజమని తేలితే తాను రాజకీయల నుంచే వెళ్లిపోతానని సవాలు విసిరారు. ఒకవేళ వాటిని నిరూపించకపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు.   

Also Read: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి...

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. కర్ణాటక అంశాన్ని లేవనెత్తారు. అక్కడ ఎక్సైజ్‌శాఖలో భారీ కుంభకోణం జరిగిందని.. దీని నుంచి వచ్చిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తోందని ఆరోపణలు చేశారు. ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో.. ఆ రాష్ట్రం కాంగ్రెస్‌ రాజ కుటుంబానికి డబ్బులు ఇచ్చే ఏటీఎంగా మారుతోందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాజ కుటుంబానికి హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఏటీఎంలుగా మారిపోయాయని అన్నారు. 

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్‌ వసూళ్లకు పాల్పడుతోందని తెలిపారు. కర్ణాటకలో లిక్కర్ వ్యాపారుల నుంచి ఏకంగా రూ.700 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తన్నాయన్నారు. ఈ క్రమంలోనే ఈ అంశంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య మోదీ చేసిన ఆరోపణలు ఖండించారు. ఒక దేశ ప్రధాని ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తాను చేసిన చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేకపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు.   

Also read: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు.. 11 మంది మిలిటెంట్లు హతం

అయితే కర్ణాటక వైన్స్ మర్చెంట్స్‌ అసోసియేషన్ ఇటీవలే ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు చేసింది. వైన్స్‌లకు లైసెన్సులు మంజూరు చేయడం కోసం ప్రభుత్వం రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు చెప్పింది. గత ఏడాది ఇలా దాదాపు వెయ్యి లైసెన్సులను అక్రమంగా ఇచ్చారని.. దీంతో రూ.300 నుంచి 700 కోట్ల వరకు స్కామ్ జరిగిందని  వైన్స్ మర్చెంట్స్‌ అసోసియేషన్ ఆరోపణలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో చర్చనీయాంశమవుతోంది. 

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు