Mumbai: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి... ముంబైలోని గోరై బీచ్‌లో దొరికిన ఓ శవం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. దీనిని నిరంతరం పర్యాటకులతో రద్దీగా ఉండే గోరై బీచ్‌లో పడేశారు. By Manogna alamuru 11 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Mumbai Gore Beach: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగు చూసింది. ముంబై గోరై బీచ్‌లో అనుమానాస్పద రీతిలో ఓ బ్యాగ్ కనిపించింది. దీనిని చూసిన స్థానికులు ఎందుకైనా మంచిదని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్కు గురి అయ్యారు. బ్యాగులో ముక్కలు ముక్కలుగా ఉన్న మనిషి బాడీ పార్ట్స్ చూసి ఖంగుతిన్నారు. ఇది కూడా చదవండి: చలికాలంలో తులసితో ఆస్తమాని ఇలా అడ్డుకోండి ముంబై గోరే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఈ శవానికి సబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే శవం ఎవరిదన్నది ఇంకా తెలియలేదు.మృతదేహం పరిస్థితిని బట్టి చూస్తే.. హత్య జరిగి కొన్ని రోజులు అయి ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. కావాలనే మృతదేహాన్ని బీచ్‌లో పడేసి వెళ్ళిపోయరని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి మిస్సింగ్ కేసుల సమాచారం సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా ముందు శవం ఎవరిదో తెలిస్తే...అక్కడి నుంచి ఎవరు చంపారు, ఎందుకు చంపారు లాంటి విషయాలపై విచారణ చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! Also Read: USA: హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం–వివేక రామస్వామి ఇది కూడా చదవండి: Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ! #ded-body #mumbai #Gorai Beach #seven pieces మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి