Manipur: మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు.. 11 మంది మిలిటెంట్లు హతం

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.

New Update
Military

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌పై దాడులు జరిగిన సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే వీళ్లందరూ కూడా కుకీ తిరుగుబాటుదారులుగా పోలీసలు అనుమానిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బోరోబెక్రా పోలీస్ స్టేషన్‌పై సోమవారం మధ్యాహ్నం కొందరు మిలిటెంట్లు దాడులు చేశారు. 

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

11 మంది హతం

ఆ తర్వాత దగ్గర్లో ఉన్న జకురాడోర్‌ కరోంగ్‌ అనే గ్రామం వైపు దూసుకెళ్లి నానా బీభత్సం చేశారు. చాలా దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు- మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది సాయుధులు హతమైనట్లు అధికారులు తెలిపారు. అయితే పలువురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

మహిళ మృతితో ఉద్రిక్త పరిస్థితులు

ఇదిలాఉండగా.. బిష్ణుపుర్‌ జిల్లాలో ఇటీవల మిలిటెంట్ల దాడిలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నవంబర్‌ 9న ఇంఫాల్‌ లోయలోని సైటాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పొలంలో పనిచేస్తున్న రైతులను లక్ష్యంగా చేసుకొని సాయుధులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళ మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్తితులు చెలరేగాయి. ఇప్పుడు తాజాగా మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా మణిపూర్‌లో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. గత ఏడాది ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

Advertisment
Advertisment
తాజా కథనాలు