Jharkhand Elections: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ సిద్ధమైంది. ఎల్లుండి అంటే నవంబర్ 13న మొదటి దశ 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడి జేఎంఎం, బీజేపీలు పోటీలో ఉన్నాయి. జార్ఖండ్‌ ఎన్నికల్లో ప్రధానాంశాలు ఇవే..

New Update
elections

Jharkhand Elections: 

గత ప్రభుత్వంలోని సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అవడం...దాంతో సీఎం మారడం..మళ్ళీ ఆయన జైలునుంచి తిరగి వచ్చి అధికారాన్ని చేజిక్కుంచుకోవడం ఇలా బోలెడు ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ సారి జార్ఖండ్ ఎన్నికలకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ రెండు దశల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. మొత్తం 81 స్థానాలుండగా..ఎల్లుండి మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌ లో జేఎంఎం, బీజేపీల మధ్య అత్యధిక పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో అవినీతి, ప్రజాకర్షక హామీలు, కేంద్ర నిధుల విడుదల లాంటిఅంశాలు కీలకంగా నిలిచాయి. 

Also Read: 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

జార్ఖండ్ ఎన్నికల్లో బీజపీ చొరబాట్లను ప్రధానాంశంగా ఎంచుకుంది. బంగ్లాదేశ్, రోహింగ్యాల చొరబాట్లను ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా వాడుకుంది బీజేపీ. సంతాల్‌ పరగణాలు, కొల్హాన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య భారీగా ఉందని.. రాష్ట్రాన్ని ధర్మసత్రంగా మారుస్తున్నారని బీజేపీ ప్రచారం చేసింది. ఓట్ల కోసమే అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కూడిన జేఎంఎం ప్రభుత్వం ఆశ్రయమిస్తోందని ఆరోపించింది. అయితే ఈ విమర్శలను జేఎంఎం ఖండించింది. రివర్స్‌లో రాష్టానికి రావాల్సిన నిధులు విఉదల చేయడం లేదంటూ బీజేపీకి కౌంటర్ అలాటక్ ఇచ్చింది. కేంద్రం కావాలని తనపై అక్రమ కేసులు పెట్టిందని సీఎం హేమమంత్ సోరెన్ ఆరోపించారు. 

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

ఇక ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు బోలెడు ప్రజాకర్ష పథకాల హామీలను కురిపించాయి.  జేఎంఎం ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. అలాగే ఎల్‌పీజీ సిలిండర్‌ రూ.500లకే అందించడంతోపాటు ఏడాదికి రెండు ఉచితంగా ఇవ్వడం, నిరుద్యోగులకు రెండేళ్ల పాటు నెలకు రూ.2వేల చొప్పున అందిస్తామని ... ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు, రెండున్నర లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి హామీలూ కురిపించింది.
మరోవైపు బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా జేఎంఎం మరో ముందడుగు వేసి.. ఈ మొత్తాన్ని రూ.2500కు పెంచుతామని హామీ ఇచ్చింది. 

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

అయితే ఈసారి ఎన్నికల్లో అన్నింటికంటే సీఎం హేమంత్ సోరెస్ అరెస్ట్, అవినీతి ప్రధానాంశాలుగా నిలిచాయి. దీన్ని ఆసరాగా చేసుకుని జేఎంఎం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంతో పాఊ ఇక్కడ ఆదివాసీ ఓట్లు ఈసారి చీలే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పుడు చంపయ్  సీఎం అయ్యారు. కానీ హేమంత్ తిరిగి రాగానే ఆయన తన అధికారాన్ని వదలాల్సి వచ్చింది. దీంతో చంపయ్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ అయిపోయారు.  తాజా ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయీకి ఉన్న ప్రజాదరణ వల్ల ఆ వర్గం ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయని, అది జేఎంఎ-కాంగ్రెస్‌ కూటమిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Hyderabad: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం

Advertisment
Advertisment
తాజా కథనాలు