/rtv/media/media_files/2025/04/14/240rKLSYZocHGoxu37RY.jpg)
Vishwambhara
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ టీజర్ విడుదలైన తర్వాత, గ్రాఫిక్స్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంచనాలకు భిన్నంగా, విజువల్స్ చాలా నాసిరకంగా ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మోత మోగింది.
ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమాపై ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు ఈ సినిమా సంక్రాంతి 2025 సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, తక్కువ నాణ్యత గల గ్రాఫిక్స్ వల్ల విడుదల వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ఆయన తండ్రి గతంలో ‘ఢీ’, ‘బన్ని’, ‘భగీరథ’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
(AI) ఆధారంగా విశ్వంభర టీజర్..!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “విశ్వంభర షూటింగ్‌లో భాగంగా కొంత ఫుటేజ్‌ను వీఎఫ్‌ఎక్స్ టీమ్‌కు అందజేశాం. వాళ్లు మూడు నెలల్లోనే వర్క్ పూర్తి చేస్తామన్నారు. కానీ, మా టీమ్ మాత్రం ప్రాజెక్ట్ పెద్దదైనందున కనీసం ఆరు నెలలు సమయం తీసుకోవాలని సూచించింది. కానీ చివరికి తొమ్మిది నెలలు గడిచినా వీఎఫ్‌ఎక్స్ పూర్తిగా కాలేదు. విడుదల తేదీ దగ్గరపడటంతో తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(AI) ఆధారంగా టీజర్‌ను రూపొందించాల్సి వచ్చింది. అది అసలు గ్రాఫిక్స్ కాదు. అందుకే విమర్శలు వచ్చాయి” అని వివరించారు.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
ఈ ట్రోలింగ్ తర్వాత వీఎఫ్‌ఎక్స్ టీమ్ మరింత జాగ్రత్తగా పని చేయడం మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. “ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా సీరియస్ గా జరుగుతోంది. త్వరలోనే అసలైన టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాకి సంబంధించిన అద్భుతమైన గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇది ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మా నమ్మకం,” అని పేర్కొన్నారు.
"Whatever you saw in the Vishwambhara teaser was AI-generated graphics, not the original CG. It won't be in the movie."
— Whynot Cinemas (@whynotcinemass_) April 12, 2025
- Producer Satyanarayana Reddy #Chiranjeevi #Vishwambhara pic.twitter.com/mgnGgLFpBr
Also Read: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
గత టీజర్‌లో కొన్ని హాలీవుడ్ చిత్రాలను కాపీ కొట్టారని, "దెయ్యాల కోట"లా ఉందని కామెంట్లు ప్రేక్షకుల నుంచి వచ్చాయి. పాన్ ఇండియా మూవీ అంటే ఇలా ఉండకూడదంటూ అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం, అన్ని లోపాలను సరిచేసి విశ్వంభర సినిమాను జులై 24, 2025న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!