PM Modi: కర్నూలు చేరుకున్న ప్రధాని.. నేడు మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు తదితరులు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.

New Update
Pm Modi

Pm Modi

కర్నూలు(kurnool) లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు తదితరులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఇక్కడ నుంచి సున్నిపెంట వరకు హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలోనే శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్నం 12:05గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ తర్వాత మళ్లీ హెలికాప్టర్‌లో నన్నూరుకు వచ్చి రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వద్ద ‘సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌’ బహిరంగ సభకు హాజరవుతారు.

ఇది కూడా చూడండి:  PM Narendra Modi : ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. మొత్తం షెడ్యూల్‌ ఇదే!

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!

ఈ సభలో ప్రధాని మోదీ విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రూ. 13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలులోని నన్నూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరవుతారు.

Advertisment
తాజా కథనాలు