/rtv/media/media_files/2024/10/27/jVFopqvEIubvtvaNRMrG.jpg)
భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా(kurnool-district) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో ఆయన ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని, అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ. 13,430 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధానితో పాటుగా, సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ప్రధాని హోదాలో తొలిసారి శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో, ఆలయ అధికారులు, స్థానిక యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read : గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్‌లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
షెడ్యూల్ ఇదే
- ఉదయం 7:20 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరుతారు.
- ఉదయం 9:50 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి (ఓర్వకల్లు) చేరుకుంటారు.
- ఉదయం 10:35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకుంటారు.
- ఉదయం 11:15 గంటలకు శ్రీశైలం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో పూజలు, దర్శనం చేసుకుంటారు.
- మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
- మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి కర్నూలులోని నన్నూరు హెలిప్యాడ్‌కు బయల్దేరుతారు.
- మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలులోని నన్నూరు వద్ద సుమారు రూ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు/ప్రారంభోత్సవాలు చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- సాయంత్రం 4:40 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Also Read : రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో వానలే వానలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ!
ప్రధాని మోదీ(PM Modi) ఈ పర్యటనలో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమల రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రూ. 13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలులోని నన్నూరు ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీశైలం రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.