బిహార్ అసెంబ్లీ ఎన్నిక(bihar-assembly-elections)లపై జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(prashanth-kishore) సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు లేవన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే మరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ప్రశాంత్ కిషోర్ పార్టీకి మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు.
Also Read: తల్లి పాలలో యురేనియం.. ప్రమాదం లేదంటున్న శాస్త్రవేత్తలు
Prashanth Kishore Comments On Bihar Elections 2025
ఇది తనకు ఎంతగానో బాధ కలిగించిందని తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఎన్నికల సమయంలో తమ టీమ్ సేకరించిన ప్రజాభిప్రాయాలకు, వచ్చిన ఫలితాలకు తేడా ఉందన్నారు. ఎక్కడో తప్పు జరిగినట్లు తాను భావిస్తున్నానని తెలిపారు. అంతేకాదు ప్రజలకు తెలియని పార్టీలకు కూడా లక్షల ఓట్లు వచ్చాయన్నారు. EVMలు తారుమారు చేసినట్లు చెప్పాలని కొందరు నన్ను అడుగుతున్నారని.. కానీ దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలు లేవని తెలిపారు.
Also read: రెండు సెకన్ల వీడియో.. 100 మిలియన్ల వ్యూస్..ఇంతకీ ఏం జరిగిందంటే?
మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రూ.10 వేలు జమ చేయడంపై కూడా పీకే విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు తన రాజకీయ జీవితం ముగిసిందని వస్తున్న ఆరోపణలను ఖండించారు. బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా జన్‌సురాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసింది. పలు ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ పార్టీకి 5 సీట్ల వరకు వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేశాయి. కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఈ ఓటమికి తానే 100 శాతం బాధ్యత తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల ప్రకటించారు.
Prashanth Kishore: బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్.. ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు లేవన్నారు.
Prashanth kishore key comments on bihar elections