PM Modi: నా తల్లిని అవమానించారు.. మోదీ ఆవేదన

RJD, కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పలు సమావేశాల్లో, వేదికలపై చనిపోయిన తన తల్లిని దూషించారని ఆయన ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు అవమానం జరిగిందంటూ వాపోయారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
PM Modi

PM Modi

విపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రలో కొంతమంది ప్రధాని మోదీ తల్లిని దూషించారని ఇటీవల బీజేపీ తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై తాజాగా మోదీ స్పందించారు. RJD, కాంగ్రెస్ నేతలు నిర్వహించిన పలు సమావేశాల్లో, వేదికలపై కూడా కూడా చనిపోయిన తన తల్లిని దూషించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు అవమానం జరిగిందంటూ వాపోయారు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌ రాజ్య జీవకనిధి శాఖ సహాయ సంఘ్‌ లిమిటెడ్‌ మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం 20 లక్షల మందిని ఉద్దేశించి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

Also Read: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!

 ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లికి సంబంధించిన విషయం గురించి ప్రస్తావించారు. కొన్నిరోజుల క్రితం బిహార్‌లో RJD, కాంగ్రెస్‌ల వేదికపై తన తల్లిపై కొందరు అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాళ్లు చేసిన ఈ వ్యాఖ్యలు తన తల్లికి మాత్రమే జరిగిన అవమానం కాదని.. దేశంలోని తల్లులు, సోదరీమణులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తనను బాధపెట్టాయని.. బిహార్‌ ప్రజలు కూడా ఇలాగే బాధపడ్డారని పేర్కొన్నారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌ల వల్ల రెండు దేశాలకు నష్టమే.. USISPF అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

'' మా తల్లి హీరాబెన్ మోదీ నన్ను, నా తోబుట్టువులను పెంచేందుకు ఎంతగానో కష్టపడ్డారు. ఆమె అనారోగ్యంతో ఉండేది. అయినప్పటికీ మమ్మల్ని పెంచేందుకు పనులు చేస్తూనే ఉండేది. మాకు చిన్నప్పుడు బట్టులు కొనిచ్చేందుకు ప్రతి పైసాను ఆదా చేస్తుండేది. అలాంటి తల్లులు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. తల్లి స్థానం అనేది దేవతల కంటే గొప్పది. రాజకుటుంబాల్లో పుట్టిన యువరాజులు (రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశిస్తూ).. పేద తల్లి బాధలు, ఆమె కొడుకు చేసే పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్లందరు గొల్డెన్‌ స్పూన్‌తో పుట్టారు. బిహార్‌లో తమ కుటుంబాలకే అధికారం రావాలనే స్వార్థంతో వాళ్లు ఉన్నారు. ఒక పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి ప్రధానిని చేశారు. దీన్ని నామ్‌దార్లు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని'' ప్రధాని మోదీ అన్నారు. 

Also Read: భర్త మిస్సింగ్..  ఇన్‌స్టాగ్రామ్ లో  మరో భార్యతో రీల్‌.. చివరికి బిగ్ ట్విస్ట్ !

బిహార్‌లో కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ ఓ సభ నిర్వహించింది. అందులో కొందరు కాంగ్రెస్ శ్రేణులు మోదీని, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని బీజేపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు కూడా పాట్నాలోని కొత్వాలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అరెస్టు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. దీనిపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Also Read: ఇండిగో విమానానికి తప్పిన ఘోర ప్రమాదం.. స్పాట్ లో 272 మంది ప్రయాణికులు!

Advertisment
తాజా కథనాలు