India-US: ట్రంప్ టారిఫ్‌ల వల్ల రెండు దేశాలకు నష్టమే.. USISPF అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

అమెరికా భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం (USISPF) అధ్యక్షుడు, సీఈవో ముకేశ్ ఆఘి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఇరు దేశాలు నష్టపోతున్నాయని తెలిపారు.

New Update
USISPF president Aghi

USISPF president Aghi

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం ఫోరం (USISPF) అధ్యక్షుడు, సీఈవో ముకేశ్ ఆఘి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఇరు దేశాలు నష్టపోతున్నాయని తెలిపారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు విధించడం అనవసరమైన చర్య అని పేర్కొన్నారు. భారత్‌ విషయంలో CEOల స్పందన సానుకూలంగానే ఉందని తెలిపారు. వాళ్ల తమ పెట్టుబడులు తగ్గించడం లేదన్నారు. 

Also Read: బ్రాహ్మణులపై వైట్ హౌస్ సలహాదారుడి సంచలన వ్యాఖ్యలు..!!

అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలు సున్నాకు తగ్గించేందుకు భారత్‌ ఆఫర్ ఇచ్చిందని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ముకేశ్ స్పందించారు. ట్రంప్ పెట్టే సోషల్ మీడియా పోస్టుల్లో కొన్నింట్లో మ్యాటరే ఉండకపోవచ్చని తెలిపారు. ''భారత్ ఎప్పుడూ కూడా ట్రంప్‌ పోస్టులపై ప్రతికూలంగా స్పందించలేదు. ఆయన చేసే పోస్టులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రంప్ నోబెల్ ప్రైస్ కోసం ఆరాటపడుతున్నారు. ఇక మరొకటి ఆయనకు తప్పుడు సలహాలు వస్తున్నాయి.  

Also Read: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..

గత 25 ఏళ్లలో భారత్‌-అమెరికా మధ్య డెవలప్ అయిన సంబంధాలు కేవలం 25 గంటల్లోనే దెబ్బతిన్నాయి. ఇరుదేశాలు ఒకదానికొకటి అవసరాన్ని బట్టి నిబద్ధతో ఉండాల్సిన అవసరం ఉంది.  చైనా ఎప్పుడూ కూడా భారత్‌ను సమాన భాగస్వామిగా చూడదు. భారత్‌-చైనా సంబంధాలు దీర్ఘకాలంలో అమెరికా-భారత్‌ మధ్య సంబంధాల స్థాయిని అందుకుంటాయని భావించడం లేదు. పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ అనేది అన్ని కోణాల నుంచి చూస్తే సరైనదే. అయితే వైట్‌హౌస్‌ ప్రతినిధులు, ముఖ్యంగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిక అజ్ఞానమే కారణ. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారతీయులు పరిణతి చెందినవాళ్లు. దేశం కోసం ఏది అవసరమో అది చేయాల్సి ఉంటుందని'' ముకేశ్ అన్నారు. 

Also Read: భారత పర్యటనలో జర్మన్ విదేశాంగ మంత్రి వాడేఫుల్..ఎందుకొచ్చారంటే..

Advertisment
తాజా కథనాలు