/rtv/media/media_files/2025/09/02/heart-attack-2025-09-02-12-44-46.jpg)
heart attack
Heart Attack: ఈ మధ్య గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య చూస్తుంటే గుండెల్లో గుబులు పుడుతోంది. డాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఇలా ఉన్నచోటే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు జనాలు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు బలవుతున్నారు. తాజాగా కేరళలో మరో ఉద్యోగి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. ఆఫీస్ లో ఓనం సెలబ్రేషన్స్ సందర్భంగా సహా ఉద్యోగులతో సంతోషంగా డాన్స్ వేస్తున్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. అప్పటివరకు ఆనందంతో చిందేస్తున్న అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు.
కేరళ ఓనం వేడుకల్లో విషాదం
— Volganews (@Volganews_) September 2, 2025
ఓనం వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి
సంతోషంగా డ్యాన్స్ స్టెప్పులేస్తూ, గుండెపోటుతో కుప్పకూలి జునేష్ అబ్దుల్లా(45) మృతి#kerala#OnamCelebration#Onam#viralvideo#Latest_newspic.twitter.com/MPFB8tq0ju
డాన్స్ చేస్తూ గుండెపోటు
వివరాల్లోకి వెళితే..శాసనసభ లైబ్రరీ ఉద్యోగిగా పనిచేస్తున్న జునైస్ అనే వ్యక్తి ఓనం వేడుకల సందర్భంగా అసెంబ్లీలోని శంకరనారాయణన్ తంపి హాల్‌లో నృత్య ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సహా ఉద్యోగులతో కలిసి బిబిన్ అశోక్ స్వరపరిచిన 'ఓనం మూడ్' పాటకు సంతోషంగా డాన్స్ వేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఘోరం జరిగింది. డాన్స్ వేస్తుండగానే జునైస్ సడెన్ గా స్టేజ్ పై కుప్పకూలిపోయాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దగ్గరికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జునైస్ మరణంతో ఆనందంగా జరుగుతున్న ఓనం వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జునైస్.. మాజీ నిలంబూర్ ఎమ్మెల్యే పివి అన్వర్ పర్సనల్ సెక్రెటరీగా పనిచేశాడు. ఇటీవలే హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ సాఫ్ట్వెర్ ఉద్యోగి షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా. .ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.