PM Surya Ghar Scheme: ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్.. రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ

ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనుకునే వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. pmsuryaghar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. 

New Update
solar plant

solar panel

కరెంట్ బిల్లు కట్టలేక కొందరు ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తారు. అలాంటి వారికి కేంద్రం ఓ సబ్సిడీ ఇస్తోంది. ఇంటి పైకొప్పున సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీనివల్ల కరెంట్ బిల్లు రాకుండా ఉండటంతో పాటు ఇంకా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి డబ్బు సంపాదించవచ్చు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

కరెంట్ బిల్లు తక్కువగా కూడా..

ఇళ్లపై సోలార్ పెట్టుకునే వారికి అయ్యే ఖర్చులో 40 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇవ్వనుంది. వీటివల్ల  కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. వీటివల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ.75,000 కోట్ల వరకు ఆదా అవుతుందని భావిస్తున్నారు. సాధారణ సీజన్‌తో పోలిస్తే వేసవిలో కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అలాంటి వారికి ఈ సోలార్ ప్యానెల్స్ చాలా బెటర్. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తి అయితే ప్రభుత్వానికి అమ్మేయవచ్చు. 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

ప్రతి kWకి రూ.30,000 వరకు సబ్సిడీ ఇస్తారు. అదే1 నుంచి 2 kW సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి రూ.60,000 వరకు సబ్సిడీ వస్తుంది. అలాగే 2 kW నుంచి 3 kW సామర్థ్యం ఉన్నవి పెట్టుకోవాలనుకునే వారికి రూ.60,000 నుంచి రూ.78,000 వరకు సబ్సిడీ వస్తుంది. అయితే 2 kW తర్వాత ప్రతి kWకి కేవలం రూ.18,000 మాత్రమే ఎక్స్‌ట్రా సబ్సిడీ ఇస్తారు.

3 kW కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్యానెల్స్ పెట్టుకుంటే వారికి రూ.78,000 వరకు సబ్సిడీ ఇస్తారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. భారత పౌరులై ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. అయితే pmsuryaghar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు