Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.రాష్ట్రంలో 80 వేల మంది మహిళలకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు.

New Update
CBNN

రాష్ట్రంలోని బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0 పథకం ప్రవేశపెట్టామని.. బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సవితతోపాటు, సంబంధిత అధికారులతో బీసీ సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆదరణ పథకాన్ని పునరుద్ధించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 80 వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి  వివరించారు.

Also Read: Horoscope Today: ఆ రాశుల వారికి ఈరోజు అసలు బాలేదు- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

ఆదరణ-3 పథకం ద్వారా బీసీలకు మేలు జరుగుతుందని.. ప్రతి నియోజకవర్గంలోనూ 50 శాతం రాయితీతో జనరిక్‌ మందుల షాపును ఏర్పాటు చేసి బీసీలకు ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం.  కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు ఉండే పథకమే ఆదరణ పథకమని.. ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా చంద్రబాబు ప్రవేశపెట్టారు. బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు చేసుకుని జీవనం సాగించేవారేనని.. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునిక పనిముట్లు అవసరమన్నారు. 

Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!

135 కులాలకు 964 కోట్లతో...

రాష్ట్రంలో ఆదరణ 2 పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారని.. 2014-19 మధ్యన 135 కులాలకు 964 కోట్లతో నాలుగు లక్షల మందికి 90 శాతం సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని ప్రవేశపెట్టారు. కుల వృత్తులను బట్టి పది వేలు, 20 వేలు, 30వేలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను చంద్రబాబు కుల వృత్తులు చేసుకునేవారికి అందజేశారు.

రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, గొర్రెల కాపరులకు, వడ్డెర, భవన నిర్మాణ కార్మికులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, చేనేత కార్మికులు, టైలరింగ్ చేసుకునే వాళ్ళకి, పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఎలక్ట్రిషియన్స్ ఇలా కొన్ని లక్షల మందికి తోడ్పాటును ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గౌడ కులస్తులకి రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం మద్యం షాపుల్లో వాటా ఇచ్చి గీత కులాల్ని ఆదుకున్న విషయం తెలిసిందే. 

ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు.. గొర్రెలకు, పాడిగేదలకు, పశువులకు రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బీసీలను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది.అలాగే ఆహారశుద్ధి విధానంలో భాగంగా సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ట్రాన్స్‌జెండర్, విభిన్న ప్రతిభావంతులకు మూలధన పెట్టుబడిలో ప్లాంటు, యంత్రాలపై 45% రాయితీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

గతంలో ఇది 35% ఉండగా.. దీన్ని 45శాతానికి పెంచారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్తు టారిఫ్‌లోనూ ప్రోత్సాహకాలు కల్పించారు. కొత్తగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఎస్సీ, ఎస్టీలకు భూమి విలువలో 75% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు రాయితీ అందిస్తారు.

Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!

Also Read: Air Ambulance: గుడ్‌న్యూస్‌.. భారత్‌కు త్వరలో వర్టికల్‌ టేకాఫ్‌ ఎయిర్‌ అంబులెన్సులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు