/rtv/media/media_files/2025/02/18/H8dkDWypw4ISuqcKoHWE.jpg)
pak
దాయాది దేశం పాక్ తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతుంది. అక్కడి భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దీంతో ఎన్ని అడుగుల మేర తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. 700 అడుగులు తవ్వినా నీళ్లు కనిపించకపోవడంతో.. పాక్‌వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!
ఇప్పటికే తిండి లేక విలవిలలాడుతుండగా ..ఇప్పుడు నీటి సమస్య కూడా పెరిగిపోవడంతో.. ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక పాకిస్తాన్ (Pakistan) ప్రజలు అయోమయంలో ఉన్నారు. పాక్‌లో 1990ల్లో నీటి మట్టం 100 అడుగులు ఉండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తూ ఇప్పుడు 700 అడుగులకు పడిపోయినట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: America-Russia: అమెరికాలో ఉద్రిక్తతలకు తెర పడనుందా...రష్యా ఏమంటుందంటే!
ఇక ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వచ్చేది వేసవి కాలం (Summer Season) అవ్వడంతో.. పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో అంటూ పాకిస్తాన్ సతమతంలో పడింది. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు అవ్వనుందని పాక్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో కరువు పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయిన రావల్పిండి నగర నీరు, పారిశుద్ధ్య సంస్థ.. నగరంలో ప్రజల నీటి అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తగా కీలక సూచనలు చేసింది. రావల్పిండి నగరాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తూ.. ప్రజలకు నీటి కొరత గురించి తీవ్ర హెచ్చరికలు చేసింది.రావల్పిండిలోని గారిసన్ నగరంలో నివసిస్తున్న ప్రజలకు కరువు కారణంగా నీటి కొరత ఎక్కువగా ఏర్పడిందని రావల్పిండి నగర నీరు, పారిశుద్ధ్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముహమ్మద్ సలీం అష్రఫ్ వెల్లడించారు.
వనరుల కొరత కూడా...
దీంతో పాటు జనాభా వేగంగా పెరుగుతుండటం, అనేక ఆర్థిక కార్యకలాపాలు, వనరుల కొరత కూడా ఈ నీటి కొరతకు కారణం అమవుతున్నాయని చెప్పారు.అయితే పాకిస్తాన్‌లో సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. చాలా కాలంగా వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లు, భూగర్భ జల వనరుల్లో నీటిమట్టం వేగంగా తగ్గిపోయిందని ముహమ్మద్ సలీం అష్రఫ్ తెలిపారు.
ఈ కారణంగానే పాక్ ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రావల్పిండి నగరానికి ప్రతిరోజూ 68 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే రావల్-ఖాన్పూర్ ఆనకట్టలు, 490కి పైగా బోర్లు సహా ప్రస్తుతం ఉన్న అన్నిరకాల నీటి వనరులను ఉపయోగించినా.. 51 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే అందుంతోందని చెప్పారు. అంటే ఇప్పటికే రావల్పిండి నగరంలో నీటి సమస్య ఉందని.. రానున్న కాలంలో అది మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయని.. స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు
Also Read: Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్