/rtv/media/media_files/2025/08/25/pm-narendra-modi-urges-indians-to-not-buy-foreign-goods-2025-08-25-06-35-31.jpg)
PM Narendra Modi Urges Indians to not Buy Foreign Goods
ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యువతీ యువకులు విదేశీ వస్తువులను కొనడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని.. విదేశీ వస్తువులను ఇంటికి తీసుకొచ్చే సంస్కృతిని వదిలేయాలని సూచించారు. యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో స్వయం సమ-ృద్ధే తప్పనిసరని తెలిపారు. దేశీయ ఉత్పత్తులనే ఆదరించాలని కోరారు. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లో దేశీయంగా తయారు చేసిన సెమికండక్టర్ చిప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే స్వదేశీ 6జీ నెట్‌వర్క్ కూడా వేగంగా పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
Also Read: ఆఫీస్‌లో అదనపు గంటలు పనిచేస్తున్నారా ? సర్వేలో షాకింగ్ నిజాలు
'' ఆపరేషన్ సిందూర్ మాత్రమే దేశభక్తికి సింబల్ కాదు. స్వదేశీ వస్తువులనే విక్రయిస్తామని వ్యాపారుల నిర్ణయం తీసుకోవడం వల్ల దేశభక్తిని చాటిచూపాలి. స్కిల్ ఇండియా వల్ల కోట్లాదిమంది యువత నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తయారవుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు వృద్ధాప్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పడు చాలా దేశాలకు యువత కావాలి. ప్రపంచానికి యువతను అందించే సత్తా భారత్‌కు ఉంది. రాబోయే రోజుల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే మనమందరం దేశీయ ఉత్పత్తులనే వినియోగించాలని'' ప్రధాని మోదీ అన్నారు.
🚨 BIG STATEMENT by PM Modi 🚨
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2025
— “By year-end, India will have its first Made-in-India semiconductor chip in the market.”
— “Work on indigenous 6G is progressing rapidly.”
— “After decades of neglect, India is emerging as a global semiconductor hub.”pic.twitter.com/hDkxb3LELb
Also Read: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
అయితే భారత్‌లో స్వదేశీ వస్తువులు వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా చేస్తే దేశీయ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచుతుంది. స్వదేశీ వస్తువుల వినియోగం వల్ల దేశంలో తయారైన వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. ఇది పరిశ్రమలకు, చిన్న వ్యాపారాలకు, చేతివృత్తులకు ఎంతగానో సహాయపడుతుంది. స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగినట్లయితే, వాటిని తయారు చేసే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో ఎంతగానో సాయపడుతుంది.
Also Read: మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?
మనం విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులను ఎక్కువ వాడితే.. విదేశాల నుంచి దిగుమతులు కూడా తగ్గిపోతాయి. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఎంతగానో ఆదా అవుతుంది. స్వదేశీ వస్తువుల్లో దేశీయ సంస్కృతి, కళలు, చేతివృత్తులు ప్రతిబింబిస్తాయి. వాటిని ప్రోత్సహించడం ద్వారా మన సంప్రదాయాలను, కళలను కాపాడుకోవచ్చు. చాలావరకు స్వదేశీ ఉత్పత్తులు చిన్న గ్రామాలు, పట్టణాలలోని చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారాల ద్వారా తయారవుతాయి. వాటిని జనాలు కొనడం వల్ల వారి జీవనం మెరుగుపడుతుంది.
Also read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్ నిందితునిపై పోలీసుల కాల్పులు