/rtv/media/media_files/2026/01/18/modi-2026-01-18-18-16-01.jpg)
Modi
కాంగ్రెస్ పార్టీ(Congress Party) అనుసరిస్తున్న తీరుపై ప్రధానమంత్రి మోదీ(PM Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మెట్రో సేవలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన ఆయన తీవ్రంగా ఖండించారు.
#WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "... The Congress turned a global event for India into a platform for its dirty and naked politics. Congress leaders reached the venue naked in front of the foreign guests. I ask the Congress people, the country… https://t.co/fa5yKag8oqpic.twitter.com/81zAr1Qsar
— ANI (@ANI) February 22, 2026
Also Read : విజయ్ దళపతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ అక్కడి నుంచే!
దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడంపై మోదీ మండిపడ్డారు. "ఏఐ సమ్మిట్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు, అది దేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయి సదస్సు. కానీ, కాంగ్రెస్ పార్టీ మురికి, నగ్న రాజకీయాలతో ఆ వేదికని అపహాస్యం చేసింది. ఇప్పటికే నగ్నంగా ఉన్నామని దేశ ప్రజలకు తెలిసినప్పుడు, మరీ బట్టలు విప్పి ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది?" అని ఆయన సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా దివాలా తీసిందని, దేశం సాధిస్తున్న విజయాలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని విమర్శించారు. "కాంగ్రెస్ నాయకులు నన్ను ద్వేషిస్తారు, నా తల్లిని కూడా అవమానించడానికి వెనుకాడరు. ఇప్పుడు ఏకంగా దేశాన్ని కించపరచడంలో నిమగ్నమయ్యారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంటే, వీరు మాత్రం దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న అవినీతి విధానాలను, మర్యాద లేని ప్రవర్తనను దేశం మొత్తం గమనిస్తోందని మోదీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ వేగాన్ని అడ్డుకోవాలని చూస్తున్న శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read : మరికొన్ని గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. కానీ, అంతలోనే ఏం చేశారంటే?
Follow Us