/rtv/media/media_files/2025/12/03/pm-modi-to-west-bengal-bjp-mps-2025-12-03-16-34-22.jpg)
PM Modi To west Bengal BJP MPs
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ప్రస్తుతం అక్కడ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహిస్తున్నారు. తాజాగా దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. SIR నిర్వహణపై బెంగాల్ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ ప్రక్రియను పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచనలు చేశారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చుకోవడం, అర్హత లేని వాళ్లని తొలగించడమే SIR ఉద్దేశమని పేర్కొన్నారు.
Also Read: మరో ఎన్‌కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రెడీగా ఉండాలని అన్నారు. విపక్ష పార్టీల ట్రాప్‌లో పడొద్దని చెప్పారు. అంతేకాదు ఇప్పటివరకు బెంగాల్‌లో బీజేపీ విస్తరించిన అంశంపై మాట్లాడారు. 2011లో అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. 2021లో ఆ సంఖ్య 65కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక అంశాలపై కూడా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు SIRను విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకుస్తున్నాయి.
Also Read: రేపు, ఎల్లుండి భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు
ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్‌గా మారిందని టీఎంసీ పార్టీ విమర్శిస్తోంది. తనను రాజకీయంగా ఎప్పటికీ ఓడించలేరని గతంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. SIR తర్వాత ఓటర్ల లిస్ట్ బయటికి వచ్చినప్పుడు ఎన్నికల సంఘం, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను రెండు, మూడేళ్లపాటు నిర్వహిస్తేనే సహకరిస్తామని తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు SIR నిర్వహించిన సంగతి తెలిసిందే.
PM Modi meets with West Bengal BJP MPs, asks them to work harder ahead of polls, as per sources
— NDTV (@ndtv) December 3, 2025
NDTV's @Vasudha156 joins @VedikaS with more details pic.twitter.com/RIbQUJAev4
Also Read: వామ్మో.. 5,900 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ గేమ్.. వీడియో వైరల్
Follow Us