/rtv/media/media_files/2025/12/03/maoists-2025-12-03-14-53-31.jpg)
Encounter in Chattisgarh, 5 Maoists killed
గత కొన్నిరోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దశల వారిగా లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇటీవల మావోయిస్టులకు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) ప్రత్యేక జోనల్ కమిటీ సంచలన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న తాము ఆయుధాలు వదిలేసి లొంగిపోతామని లేఖను విడుదల చేసింది. ఇప్పటికే చాలామంది మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. కొన్నిరోజుల క్రితం కీలక నేత హిడ్మా మృతితో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం వారి ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఈ క్రమంలోనే తాము లొంగిపోతామని సంచలన ప్రకటన చేశారు. అయినప్పటికీ తాజాగా మరోసారి ఎన్‌కౌంటర్ జరగడం, ఈ ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది.
Follow Us