/rtv/media/media_files/2025/12/03/football-under-hot-air-balloon-2025-12-03-15-46-24.jpg)
Russian Daredevil Plays Football Under Hot Air Balloon At 1,800 Metres
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులు ఆ ఆటను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆ మ్యాచ్‌ను ఎప్పుడైన గాల్లో ఆడటం చూశారా ?. అదేంటి గాల్లో ఫుట్‌బాల్ ఆడటం ఏంటి అనుకుంటున్నారా ?. నిజంగానే అది జరిగింది. రష్యాకు చెందిన అథ్లె్ట్ సెర్గీబాయ్‌త్సవ్ అనే వ్యక్తి ఈ ఘనతను సాధించాడు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ఆకాశంలోకి వెళ్లిన అతడు తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి రికార్డు సృష్టించాడు.
Also Read: చైనా సర్కార్ పిచ్చి చేష్టలు.. కండోమ్ కే పైసలు లేకుంటే పిల్లలను ఎలా పెంచుతారు?
దీనికి సంబంధించిన వీడియోను సెర్గీ.. తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ ఆటగాళ్లు హాట్ ఎయిర్‌బెలూన్‌లో హాట్ ఎయిర్‌బెలూన్‌లో 5,900 అడుగుల (1800 మీటర్లు) ఎత్తుకు వెళ్లారు. అక్కడ ఓ ఆర్టిఫిషియల్ మినీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. ఆ బెలున్‌కు తాళ్లతో కట్టిన ఆ చిన్న గ్రౌండ్‌పై పారాచ్యూట్ బ్యాగ్‌లు వేసుకుని ఫుట్‌బాల్ గేమ్ ఆడారు. దీనికి సంబంధించిన దృశ్యాలను హెలికాప్టర్‌లో రికార్డు చేశారు. చివరి సమయంలో ఓ ప్లేయర్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో లాగా గోల్ కొట్టి అదరగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను అప్‌లోడ్ చేసిన సెర్గీ మేము కొత్త రికార్డు సృష్టించామంటూ రాసుకొచ్చారు. ప్రపంచంలోనే హాట్ ఎయిర్ బెలూన్‌తో ఆడిన మొదటి ఫుట్‌బాల్ మ్యాచ్ ఇదేనంటూ పేర్కొన్నారు. ఈ వీడియోను ఇప్పటిదాకా దాదాపు 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. అయితే సెర్గీ ఇలాంటి విన్యాసాలు చేయడం కొత్త విషయం కాదు. కొన్నిరోజుల క్రితం 1500 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్‌బెలూన్ కింద జిమ్మాస్టిక్స్‌ను చేసి ఆశ్చర్యపరిచాడు. అలాగే టేబుల్ టెన్నీస్, బాక్సింగ్ లాంటి ఆటలు కూడా గాల్లో ఆడి వాటి వీడియోలు షేర్ చేశాడు.
Follow Us