Rahul Gandhi: 'ట్రంప్‌ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ

ట్రంప్ బెదిరింపులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష రాహుల్‌ గాంధీ మరో బాంబు పేల్చారు. ఈ అంశంలో ప్రధాని మోదీ చేతులు కట్టేశారంటూ ఎక్స్‌లో సెటైర్లు వేశారు.

New Update
Modi and Rahul Gandhi

Modi and Rahul Gandhi

ఇటీవల భారత్‌పై టారిఫ్‌లు మరింత పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ బెదిరింపులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష రాహుల్‌ గాంధీ మరో బాంబు పేల్చారు. ఈ అంశంలో ప్రధాని మోదీ చేతులు కట్టేశారంటూ ఎక్స్‌లో సెటైర్లు వేశారు. అదానీపై అమెరికాలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అందుకే ట్రంప్ టారిఫ్‌ పెంచుతానిని పదేపదే బెదిరించినా మోదీ మౌనంగా ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మోదీ, అదాని-అంబానీ అలాగే రష్యా చమురు ఒప్పందాల ఆర్థిక వ్యవహారాలను బయటపెడతారనే భయం ఉంది. మోదీ చేతులను కట్టేశారని'' రాహుల్ రాసుకొచ్చారు. 

Rahul Gandhi About Trump Tariffs

Also Read: ఇండియా మా ఫ్రెండే.. మీరే దొబ్బేయండి.. చైనా, పాక్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్!

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భారత్..రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించడంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తామని ప్రకటించిన ట్రంప్.. మళ్లీ గణనీయంగా పెంచుతామంటూ హెచ్చరించారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు చనిపోతుంటే భారత్‌ మాత్రం రష్యాతో చమురును తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రయోజనం పొందుతోందని మండిపడ్డారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది.

Also Read:  గాజా స్వాధీనానికి నెతన్యాహు ప్లాన్..ఆపాలని ట్రంప్ కు లేఖ రాసిన ఇజ్రాయెల్ మాజీలు, నేతలు

అమెరికా కూడా రష్యా పలు వస్తువులు దిగుమతులు చేసుకుంటోన్న విషయాన్ని ఎత్తిచూపింది. రసాయనాలు, ఎరువులు వంటి వాటిని అమెరికా రష్యా నుంచి కొనుగోలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది. ఈ విషయంలో భారత్‌ను టార్గెట్‌ చేయడం కరెక్ట్‌ కాదంటూ హితువు పలికింది. కానీ ట్రంప్‌ టారిఫ్‌లు విధించడంపై ప్రధాని మోదీ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. దీంతో విపక్ష నేతలతో పాటు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మోదీ తీరును విమర్శిస్తున్నారు. ట్రంప్‌తో మోదీకి ఉన్న కౌగిలింతల దౌత్యం కూప్పకూలిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శలు చేశారు. 

భారత్‌ విషయంలో ట్రంప్‌ వైఖరీపై రిపబ్లికన్ పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. భారత్‌ విషయంలో కఠినంగా వ్యవహరించొద్దని ఆ పార్టీకి చెందిన భారత సంతతి నేత నిక్కీ హేలీ హెచ్చరించారు. ''భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయకూడదు. కానీ రష్యా, ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం 90 రోజుల టారిఫ్‌ మినహాయింపు ఉంటుంది. చైనాకు మినహాయింపు ఇచ్చి భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు నాశనం చేసుకోవద్దని'' నిక్కీ హేలీ సూచించారు.  

usa | rtv-news | telugu-news

Advertisment
తాజా కథనాలు