సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్‌ మసాలాపై సెస్సు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.

New Update
Additional excise duty on tobacco

Additional excise duty on tobacco

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్‌ మసాలాపై సెస్సు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని  తెలిపింది. సిగరెట్లు, పాన్‌ మసాలా, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం, బీడీలపై 18 శాతం GSTని కేంద్రం విధించింది. ఈ పన్నుతో పాటు పాన్‌ మసాలపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్‌ పెంచింది. అలాగే పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వేసింది.   

Also Read: న్యూఇయర్‌ వేళ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

గతేడాది డిసెంబర్‌లో పాన్‌ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్‌, పొగాకు ప్రొడక్ట్స్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా రెండు బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ పాన్ మసాలపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపారు. దీనికి అదనంగా సెస్‌ ఉందని.. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్‌ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా వచ్చే నిధులను జాతీయ భద్రత బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నామని తెలిపారు. 

Also read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ప్రముఖ సిగరెట్ కంపెనీలపైన ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేర్లు పడిపోతున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఆ ఉత్పత్తుల ధరలు పెరగనుండటంతో అమ్మకాలు తగ్గే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ స్టాక్స్‌ నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. BSEలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్ఠానికి పడిపోగా.. ఫిలప్స్‌ షేరు 10 శాతం పడిపోయింది. 

Advertisment
తాజా కథనాలు