Indiramma Canteens : ఆ క్యాంటీన్లలో రూ.5 కే ఇడ్లీ, పూరి, ఉప్మా.. ఎప్పటి నుంచంటే..

రూ.5కే భోజనం అందజేస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇకమీదట అల్పాహారం (టిఫిన్లు) కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్ని అనుకున్నట్లు కుదిరితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచే ఉదయం టిఫిన్‌ వడ్డించాలని అధికారులు నిర్ణయించారు.

New Update
Indiramma Canteens

Indiramma Canteens

రూ.5కే భోజనం అందజేస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇకమీదట అల్పాహారం (టిఫిన్లు) కూడా అందుబాటులోకి రానున్నాయి. అన్ని అనుకున్నట్లు కుదిరితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచే ఉదయం టిఫిన్‌ వడ్డించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కసరత్తు వేగవంతం చేసింది. రూ.5భోజనం అందిస్తున్న కేంద్రాల్లోనే అల్పాహారం కూడా అందుబాటులో ఉండనుంది. అయితే ఇప్పుడున్న క్యాంటీన్‌ నమూనానూ జీహెచ్‌ఎంసీ మారుస్తోంది. 40/10, 20/10 పరిమాణంతో నూతన కేంద్రాలను డిజైన్‌ చేసింది. ఎక్కువ విస్తీర్ణం ఉంటే వడ్డించేందుకు, తినేందుకు అనువుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో  ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్‌ నూతన నమూనాను ఏర్పాటు చేశారు.

Also Read : ప్రియురాలిని వశీకరణం చేసుకునేందుకు గోడ దూకాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Indiramma Canteens

దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద క్యాంటీన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కొత్త నమూనాలో జీహెచ్‌ఎంసీ లోగో, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలతో పాటు భోజనం, అల్పాహారం ఫొటోలు ఉన్నాయి. డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో 150 భోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 128 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. లబ్ధిదారులకు అల్పాహారంగా తృణధాన్యాలతో చేసిన ఇడ్లీ, ఉప్మా, పొంగల్‌, పూరి వంటివి వడ్డించనున్నారు. ఈ క్యాంటీన్లలో వారంలో ఆరు రోజులు అల్పాహారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు. ఒక్కో టిఫిన్‌కు రూ.19 ఖర్చు అవుతుండగా లబ్ధిదారుడు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా రూ.14 హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌కు జీహెచ్‌ఎంసీ చెల్లిస్తుంది.

Also Read : పెన్షన్ దారులకు గుడ్‌ న్యూస్‌...ఇక మీదట ఆ పనిచేయాల్సిన అవసరం లేదు


రోజు     మెనూ       గ్రా- గ్రాములు,     ఎంఎల్‌- మిల్లీ లీటర్లు)

డే-1    మిల్లెట్‌ ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్‌-150 ఎంఎల్‌, పొడి-15 గ్రా.

డే-2 మిల్లెట్‌ ఉప్మా- 250 గ్రా, సాంబార్‌-150 ఎంఎల్‌, మిక్చర్‌/చట్నీ-25 గ్రా.

డే-3 పొంగల్‌- 250 గ్రా, సాంబార్‌- 150 ఎంఎల్‌, మిక్చర్‌- 25 గ్రా.

డే-4 ఇడ్లీ-3 (ఒక్కొక్కటి-45 గ్రా), సాంబార్‌-75, చట్నీ-75 గ్రా.

డే-5 పొంగల్‌- 250 గ్రా, సాంబార్‌- 150 ఎంఎల్‌, మిక్చర్‌- 25 గ్రా.

డే-6 పూరి-3 (45 గ్రా.), ఆలు కూర్మ- 100 గ్రా.

Also Read:VISHWAMBHARA: 'విశ్వంభర' సెట్స్ నుంచి సాంగ్ లీక్.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలే!

Also Read :  అమ్మో.. ప్రధాని మోదీ విదేశీ టూర్ల కోసం అన్ని వందల కోట్లా ?

mint-compound | ghmc | cm-revanthreddy | mahila-shakti-canteens

Advertisment
తాజా కథనాలు