త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి నెలకొంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. అయితే తాజాగా ప్రధాని మోదీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల సంచలనం రేపిన సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన
'' మా ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించింది. కానీ నేను అద్దాల మేడ కట్టుకోలేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది. ఆప్ నేతలు లిక్కర్, స్కూల్, కాలుష్య స్కామ్‌లకు పాల్పడ్డారు. బహరంగానే అవినీతికి పాల్పడుతున్నారు. గత పదేళ్లుగా ఢిల్లీని ఓ విపత్తు (ఆప్ పార్టీని ఉద్దేశిస్తూ) చుట్టుముట్టింది. దీనికి వ్యతిరేకంగా పొరాడేందుకు ఢిల్లీ ప్రజలు సిద్ధమయ్యారని'' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: అభ్యర్థులకు అలెర్ట్.. CUET PG రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఇలా అప్లై చేసుకోండి!
అలాగే వికసిత్ భారత్ తొలి అడుగులు ఢిల్లీ నుంచే ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఢిల్లీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాము అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం డబ్బులు ఇవ్వడమే గొప్ప పథకాలుగా చెప్పుకుంటోందని విమర్శలు చేశారు. వాళ్ల పథకాల కోసం ఖర్చు చేస్తున్న సొమ్మంతా ఢిల్లీ ప్రజలవేనని తెలిపారు. సంక్షేమం పేరుతో ఢిల్లీని అభివృద్ధిని ఆప్ దూరం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజకు పిలుపునిచ్చారు.
Also Read: ఉచిత బస్ ఎఫెక్ట్..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!
Also Read: కశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా